రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ వినయ విధేయరామ తొలిరోజు కలెక్షన్లు ఆ కాంబినేషన్ మీద ప్రేక్షకులు, అభిమానులు పెట్టుకున్న అంచనాను స్పష్టం చేసాయి. తొలిరోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 26 కోట్లు వసూలు చేసింది. అది మాత్రమేకాదు, సాధారణంగా నెగిటివ్ టాక్ వచ్చినా, సమీక్షలు బాగా రాకపోయినా, భారీ మాస్ సినిమాలు ఫస్ట్ షో వేళకే డల్ అయిపోతాయి.
కానీ వినయ విధేయ సినిమా సెకెండ్ డే కూడా బాగానే వుండడం విశేషం. కింది సెంటర్లలో చాలాచోట్ల మార్నింగ్ షోలు హవుస్ ఫుల్ కావడం ఈ కాంబినేషన్ పట్ల ఫ్యాన్స్ కు వున్న క్రేజ్ ను తెలియచేస్తున్నాయి. ఒకవేళ టాక్ తో సంబంధం లేకుండా, ఆదివారంతో కలిపి పండగ అయిదు రోజులు కనుక ఇదే విధణగా పెర్ ఫార్మ్ చేస్తే, బయ్యర్లు చాలావరకు గట్టెక్కిపోతారు.
అయితే ముందుగా అందరూ ఊహించినట్లే ఈ సినిమా ఓవర్ సీస్ లో మాత్రం ఏమాత్రం పెర్ ఫార్మ్ చేయలేకపోయింది. ఓవర్ సీస్ రేట్లు చాలా భారీ ఫ్యాన్సీ రేట్లుకు అమ్మడయ్యాయి.
తొలిరోజు కలెక్షన్లు ఇలా వున్నాయి.
నైజాం………5.08
సీడెడ్……….7.15
ఉత్తరాంధ్ర…2.45
ఈస్ట్…………2.05
వెస్ట్.…………1.83
కృష్ణా………..1.45
గుంటూరు….4.17
నెల్లూరు…….1.69