దమ్ముంటే…రావద్దు

మన సినిమాల్లో హీరోలు దమ్ముంటే రా..చూసుకుందాం..అని ఘర్జిస్తారు. కానీ నిర్మాతలు  మాత్రం తమ సినిమాలను ఏ మాత్రం పోటీ లేకుంటా, ఒంటరిగా వదిలి, నాలుగు డబ్బులు చేసుకోవాలని చూస్తారు. గతంలో సంగతి ఎలా వున్నా…

మన సినిమాల్లో హీరోలు దమ్ముంటే రా..చూసుకుందాం..అని ఘర్జిస్తారు. కానీ నిర్మాతలు  మాత్రం తమ సినిమాలను ఏ మాత్రం పోటీ లేకుంటా, ఒంటరిగా వదిలి, నాలుగు డబ్బులు చేసుకోవాలని చూస్తారు. గతంలో సంగతి ఎలా వున్నా ఓ ఏడాది రెండేళ్లుగా ఈ తరహా వ్యవహారం ముదిరిపోయింది. ఎవరూ రాని సమయం, అటో వారం, ఇటో వారం గ్యాప్ ఇలాంటి అన్నీచూసుకుని థేయటర్లలోకి వచ్చి, చూసారా మేమే సూపర్ అనిపించుకుంటున్నాయి. 

అంతే కానీ నిజంగా సత్తా వుంటే, పోటీలోకి దిగి, తమ స్టామినా నిరూపించుకోవాలని అనుకోవడం ఎప్పుడో మానేసాయి తెలుగుసినిమాలు. పెద్ద సినిమాలది అన్నింటిదీ ఇదే తీరు. సోలోగా రావాలి..వెయ్యి స్క్రీన్లయినా పడాలి..మొదటి మూడు రోజుల్లో సేఫ్ అయిపోవాలి. ఇదీ తీరు. ఈసారి సంక్రాంతి సీజన్ భలే చిత్రంగా మారింది. ఆది నుంచి టెంపర్ సినిమా 9న వస్తుంది అని ప్రచారం జరిగింది. వచ్చేదే కూడా. కానీ బ్యాడ్ లక్. అనుకోని సంఘనటలు జరిగి వాయిదా పడింది. 

గోపాల..గోపాలతో పోటీ ఎందుకని ముకుంద డిసెంబర్ కు వచ్చేసింది. దీంతో జనవరి నెల మొదటి  15రోజులు సరైన సినిమా లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో తమ సినిమా వస్తున్నందుకు గోపాల గోపాల యూనిట్ మురిసిపోతుంటే, సోలోగా వస్తున్నామని పోస్టర్లు కూడా వేసేసుకుంటుంటే, పిడుగులా వచ్చి పడుతోంది ఐ. ఇంకేముంది..దాని ముందు మిగిలిన సినిమాల ఏవైనా కూడా కాస్త కష్టమే. గోపాల గోపాల వంటి క్లాస్ మూవీ సంగతేమిటి? ఎంత పవర్ స్టార్, వెంకీ వున్న సబ్జెక్ట్ మాస్ కాదు.

దాంతో ఇప్పుడు ఐ కి అడ్డం పడడం ఎలా అన్న ప్లానింగ్ ప్రారంభమైనట్లు వినికిడి. అయితే తెలుగుహక్కులు తీసుకున్న ఎన్వీ ప్రసాద్,  ఆర్బీ చౌదరి కూడా చిన్నింటివాళ్లేం కాదు. అందువల్ల  ఈ వివాదం అంత సులువుగా ముగియకపోవచ్చు. అయినా ఐ..రానీ, దాని జేజమ్మరానీ అని, బరిలోకి దిగాలి కానీ, ఇలా భయపడితే ఎలా? ఏ సినిమా అయినా సరే.