కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరికి అది ప్రెగ్నెన్సీ అయినా కూడా. కియరా అద్వానీ కూడా అలానే ప్లాన్ చేసుకొని ఉండొచ్చని చాలామంది అనుకుంటున్నారు. మరి ఈ పాన్ ఇండియా హీరోయిన్ నటిస్తున్న టాక్సిక్ మూవీ పరిస్థితేంటి?
యష్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా టాక్సిక్. ఇందులో కియరాతో పాటు నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియాతో పాటు పలువురు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. కియరా ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించింది.
ఇప్పుడామె గర్భం దాల్చడంతో టాక్సిక్ లో ఆమె తప్పుకుంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టాక్సిక్ షూటింగ్ మధ్యలో ఉంది. కాబట్టి కియరా పోర్షన్ మొత్తం అప్పుడే పూర్తయిందని చెప్పలేం. ఇంకా బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఈ 2 నెలల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఆ తర్వాత ఆమె తన గర్భం కారణంగా షూటింగ్ కు హాజరుకాలేదు.
మొన్నటికిమొన్న దీపిక పదుకోన్ కూడా ఇదే చేసింది. నెలలు నిండేలోపే కల్కి సినిమా షూటింగ్ పూర్తిచేసింది. ప్రచారానికి మాత్రం దూరమైంది. కియరా కూడా టాక్సిక్ విషయంలో అలానే ప్లాన్ చేసి ఉండొచ్చు. కాబట్టి టాక్సిక్ నుంచి ఆమె తప్పుకుందనే ప్రచారం నిజం కాదు.
Congress kiraa