ఎందుకొచ్చిన ‘టెంపర్’ ఇదంతా?

వర్మ టీట్ల వ్యవహారం టెంపర్ కు చుట్టుకుంటోంది. ఏదో హైప్ లేకుండా జాగ్రత్తగా సినిమా తీసి విడుదల చేద్దామని దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో ఎన్టీఆర్ అనుకుంటే, మొత్తానికి సినిమా వచ్చి బజారున పడింది.…

వర్మ టీట్ల వ్యవహారం టెంపర్ కు చుట్టుకుంటోంది. ఏదో హైప్ లేకుండా జాగ్రత్తగా సినిమా తీసి విడుదల చేద్దామని దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో ఎన్టీఆర్ అనుకుంటే, మొత్తానికి సినిమా వచ్చి బజారున పడింది. పూరికి తెలియకుండా ఫొటో లీక్ అవుతుందని అనుకోవడం భ్రమ. ఆ సంగతి అలా వుంచితే, పూరి ఈ సినిమాను గురువు వర్మకు చూపించినట్లు అర్థమైపోతోంది. 

గురువుపై అభిమానంతో వర్మ రష్ చూపిస్తే చూపించి వుండొచ్చు. అంత మాత్రం చేత సినిమాను అక్కర్లేని మాటలతో గాల్లోకి ఎత్తేయడం అంటే ఆ సినిమాకు హాని చేసినట్లే. పైగా పక్క హీరో అభిమానులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం అన్నది ఈ సినిమాకు ఎంత వరకు మంచిది అన్నది వర్మ ఆలోచించాలి. తెలియకుండానే వర్మ ఇటు ఎన్టీఆర్ సినిమాకే కాదు, పూరి కెరియర్ కూడా గండి కొట్టినట్లుంది. 

ఇప్పుడు పూరి త్వరలో మహేష్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు పోకిరి, బిజినెస్ మన్ లు ఎందుకు పనికిరావు టెంపర్ ముందు అని అనడం అంటే ఏమనుకొవాలి? 

ఇదిలా వుంటే అసలే ఎన్టీఆర్ సినిమాలుకు ఎస్సెమ్మెస్ ల గండం గడచిన రెండు మూడు సినిమాల నుంచి వెంటాడుతోంది. ఓ వర్గం జనాన్ని సినిమాకు దూరంగా వుంచుతున్నారు. మరి ఇంక ఇప్పుడు ఓ వర్గం ఫ్యాన్స్ ను కూడా దూరం చేసుకుంటే సినిమా పరిస్థితి ఏమిటి? వర్మ బాగానే వుంటారు..నిర్మాత, హీరో కదా దెబ్బయిపోయేది?