ఎంత చూపించినా ఆమెకు బేరాల్లేవు

అందంగా వుంటే చాలు మూగ అమ్మాయి కూడా హీరోయిన్‌ అయిపోవచ్చు. నటనతో పనిలేదు. ఎక్స్‌ప్రెషన్స్‌తో అవసరం లేదు. కేవలం కెమెరాకు అందాలు చూపిస్తే చాలు ‘ఇలియానా’లా హీరోయిన్‌ అయిపోవచ్చు అని సినిమా చరిత్ర నిరూపించింది. …

అందంగా వుంటే చాలు మూగ అమ్మాయి కూడా హీరోయిన్‌ అయిపోవచ్చు. నటనతో పనిలేదు. ఎక్స్‌ప్రెషన్స్‌తో అవసరం లేదు. కేవలం కెమెరాకు అందాలు చూపిస్తే చాలు ‘ఇలియానా’లా హీరోయిన్‌ అయిపోవచ్చు అని సినిమా చరిత్ర నిరూపించింది. 

ఎప్పుడో వైవీఎస్‌ చౌదరి దేవదాసుతో తెలుగులో అరంగేట్రం చేసిన ఇలియానాకు నటన అంటే ఏంటో తెలీదు. కేవలం తనదైన నషడుం, థండర్‌ థైస్‌ చూపించి టాప్‌ హీరోయిన్‌ అయిపోయి.. మహేష్‌బాబులాంటి నెంబర్‌ వన్‌ హీరోతో కూడా నటించేసింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాల్లేని ఇలియానా హిందీలో కాస్త కుదురుకుందని చెబుతున్నా అక్కడా పరిస్థితి ఎడారేనని చెబుతున్నారు.

హిందీ సినిమా బర్ఫీలో నటించిన ఇలియానాను అక్కడి ప్రేక్షకులు ఆకాశానికెత్తేయడంతో తెలుగును పక్కన పెట్టేసింది. హిందీలో రోజుకో కొత్తమ్మాయి పోటీ ఇచ్చే గోల తట్టుకోలేక మొన్న స్టేజి మీద ముద్దులు పెట్టించుకుంది. గతంలో ఎప్పుడూ చూపించని తన లోపలి అందాలను ఫొటో షూట్‌ చేసి ప్రెజెంట్‌ చేసింది. ముఖ్యంగా తెలుగు నిర్మాతలను మళ్ళీ ఆకర్షించాలని. ఆల్రెడీ చూసేసిన అందాల్ని మన ప్రేక్షకులు మళ్ళీ చూడరు కాబట్టి ఇలియానాకు ఇక్కడ బేరాల్లేనట్లే.