పోటీకొస్తే ‘ఎవడు’కి నష్టం!

ఆరు నెలలుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ‘ఎవడు’ చివరకు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. అయితే చూసి, చూసి సంక్రాంతికి విడుదల చేయడం వల్ల దీనికి వ్యాపారపరంగా కొన్ని చిక్కులు ఎదురు కానున్నాయి. యుఎస్‌…

ఆరు నెలలుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ‘ఎవడు’ చివరకు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. అయితే చూసి, చూసి సంక్రాంతికి విడుదల చేయడం వల్ల దీనికి వ్యాపారపరంగా కొన్ని చిక్కులు ఎదురు కానున్నాయి. యుఎస్‌ మార్కెట్‌లో మహేష్‌బాబుకి ఉన్న క్రేజ్‌ కారణంగా ఎవడుని ‘1’కి పోటీగా రిలీజ్‌ చేస్తే కష్టమని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌ భావిస్తున్నారు. 

అందుకే ఇప్పుడు ఈ చిత్రం రైట్స్‌ తీసుకున్న పంపిణీదారులు కూడా వెనక్కి తగ్గుతున్నారు. 1తో పాటు రిలీజ్‌ చేసేటట్టు అయితే ఎవడుకి ఇక్కడ థియేటర్లు దొరకడం కూడా కష్టమైపోతుందని, అస్సలు వర్కవుట్‌ కాదని అక్కడి డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజుకి చెప్పాడట. కానీ ఎవడు సంక్రాంతికి రిలీజ్‌ కాకపోతే రాష్ట్రంలో కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. 

కాబట్టి ఓవర్సీస్‌లో మరో డిస్ట్రిబ్యూటర్‌ని వెతుక్కోవడమో, లేదా తనే రిలీజ్‌ చేసుకోవడమో తప్ప దిల్‌ రాజుకి దారి లేదు. గత ఏడాది సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో రిలీజ్‌ అయినపుడు నాయక్‌ ఓవర్సీస్‌లో ఫ్లాప్‌ అయింది. ఇక్కడేమో సూపర్‌హిట్‌ అయింది. మంచి టాక్‌, రివ్యూస్‌తో కూడా నాయక్‌ అక్కడ ఎస్వీఎస్సీ ధాటికి నిలబడలేకపోయింది. అందుకే 1తో ఎవడు పోటీకొస్తుంటే ఓవర్సీస్‌ బయ్యర్లు వెనక్కి తగ్గుతున్నారు.