తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని హవుస్ లు వున్నాయి. సరైన లాంచింగ్ లేదా సరైన ప్రొడక్షన్ చేయాలంటే వీటిల్లో ఏదో ఒక దాని అండా దండా వుండాలి. అప్పుడే స్మూత్ లాంచింగ్ సాధ్యమవుతుంది. మంత్రి గంటా శ్రీనివాసరావుకు చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు వున్నాయి. అయితే అవన్నీ మెగా క్యాంప్ కే ఎక్కువగా పరిమితం అయ్యాయి.
దానికి చాలా కారణాలున్నాయి. గంటా తన కుమారుడు రవిని లాంచ్ చేయాలనుకున్నపుడు గీతా ఆర్ట్స్ అరవింద్ సలహా సహకారాల మీదే ఆధారపడ్డారు. ఆయన ఈ పనికి డైరక్టర్ మారుతిని సూచించారు. దాదాపు ఏడాదికి పైగా మారుతితో సినిమానే అనుకుంటూ వచ్చారు. అయితే మారుతి ఖాళీ లేకపోవడంతో అది అలా వాయిదా పడుతూ వచ్చింది
ఇంతలో ఈక్వేషన్లు మారిపోలేదు కానీ కొత్త బంధాలు ఏర్పడ్డాయి. విశాఖలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ మెంట్, కల్చరల్ సెంటర్ కు సినిమా రంగం అభివృద్ధికి సంబంధం లేకపోయినా, ఎకరాలకు ఎకరాలు సడెన్ గా ఇచ్చేయడం వంటి పరిణామాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ విశాఖలో స్టూడియో వుండడం, చంద్రబాబుతో మంచి సంబంధాలు కలిగి వుండడం వంటివాటితో దగ్గుబాటి సురేష్ లీడ్ లోకి వచ్చారు. విశాఖలో దగ్గుబాటి-గంటా సంబంధాలు పెనవేసుకున్నాయని వినికిడి.
దాంతో గంటారవి లాంచింగ్ బాధ్యతలు దగ్గుబాటి సురేష్ తన భుజాలపై వేసుకున్నారని వినికిడి. దర్శకుడు మారుతికి బదులుగా సురేష్ సంస్థతో మంచి సంబంధాలున్న జయంత్ సి పరాన్జీ ఇప్పుడు లైన్ లోకి వచ్చారు. సినిమా షురూ అయింది.
అన్నీ బాగానే వున్నాయి..కానీ ఇన్నాళ్లు గంటాతో సన్నిహిత సంబంధ బాంధవ్యాలుున్న చిరంజీవి, అల్లు అరవింద్, వారి అనునాయులు ఎవరూ గంటా కొడుకు లాంచింగ్ కార్యక్రమానికి హాజరు కాలేదేమిటో? అంటే రాజకీయాల్లోనే కాదు, సినిమా రంగం బంధాల్లోనూ ఇప్పుడు గంటా పూర్తిగా తెలుగుదేశం వైపు వెళ్లిపోయినట్లే అనుకోవాలి.లేదా ఇండస్ట్రీలోని వర్గాల్లో హీరోగా లాంచ్ కావాలంటే ఈ వర్గం వైపు నుంచి అయితే ప్రొజెక్షన్ వేరుగా వుంటుందని అనుకున్నారేమో?