గోపాల..గోపాల..పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు శరద్ మురార్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ సంయుక్తంగా తమ తమ క్యాంప్ హీరోలైన పవన్, వెంకీలతో నిర్మించిన సినిమా. ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తికరమైన కబుర్లు చక్కర్లు కోడుతున్నాయి టాలీవుడ్ లో.
గోపాల గోపాల వీర హైప్ నడుమ విడుదదలై ఫరవాలేదన్న టాక్ తెచ్చుకుంది. కానీ సోమవారం వచ్చేసరికి చాలా చోట్ల ఢమాల్ అంది. మంగళవారం కొన్ని సెంటర్లలో షోలు కాన్సిల్ అయ్యాయని వినికిడి. ఇదిలా వుంటే పవన్-సురేష్ క్యాంప్ ల నడుమ ఆర్థిక లావాదేవీల విషయమై సినిమా విడుదలకు ముందురోజు కాస్త మల్లగుల్లాలు జరిగినట్లు తెలుస్తోంది.
బయ్యర్లు ఫైనల్ డబ్బులు కట్టడానికి వచ్చినపుడు మాకంటే మాకు కట్టాలని శరద్ మురార్, సురేష్ క్యాంప్ మనుషులు వాదులాడుకున్నారని వార్తలు వినవస్తున్నాయి. దీంతో పవన్ అసంతృప్తితో జోక్యం చేసుకోగా, సురేష్ కలుగ చేసుకుని సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని ఏరియాల డబ్బులు వీరికి, కొన్ని ఏరియాల డబ్బులు వారికి కట్టేలా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
ఇప్పుడు సినిమా కలెక్షన్లు పడిపోయాయి. మరో రెండు రోజుల తరువాత పుంజుకుంటాయని భావిస్తున్నారు. కాస్త వారం రోజులు వేచి వుండి, మెుత్తం సినిమా లెక్కలు బయటకు తీయించాలని శరద్ మురార్ క్యాంప్ భావిస్తోందట. టాలీవుడ్ లో వున్న డీఫాల్ట్ టాక్ ఏమిటంటే సురేష్ లెక్కలు చెప్పరు. చెప్పినా అవి పద్దతిగా వుండవు అని.సినిమా ఫ్లాప్ అయితే సురేష్ కు మరీ మంచిదని, అసలు కలెక్షన్లే లేవు , ఇక లెక్కలేమిటి అని పుస్తకాలు తిరగేస్తారని టాలీవుడ్ లో జోక్ లు వినిపిస్తున్నాయి.
సినిమా తొలి రోజు నికార్సు కలెక్షన్లు ఏడు వరకు వున్నాయని, ఆదివారం నాడు నాలుగు కోట్లు కూడా చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఐ విడుదలయితే ముందు గోపాల గోపాల స్క్రీన్లు తగ్గించే ప్రమాదం వుంది. థియేటర్ల వుంటే కనీసం ఐ రిటర్న్ కలెక్షన్లు తీసుకోవచ్చు. అసలు థియేటర్లలో లేకుంటే.. మొత్తానికి గోపాల గోపాల వ్యవహారం గోల గోలగా వున్నట్లుంది.