గోపాల గోపాల సినిమాకు సంబంధించి ఇంకో చిత్రమైన సంగతి బయటకు వచ్చింది. గోపాల గోపాల సినిమా హక్కులను గల్ఫ్ ప్రాంతానికి పదిలక్షలకు కొనుక్కున్నాడట ఓ పెద్దమనిషి. అయితే మన ప్రతి సినిమా గల్ఫ్ లో మళ్లీ సెన్సారు అవుతుంది. అక్కడ ఓకె కాని పక్షంలో విడుదల కాదు. అందుకే ముందే దానికి తగ్గట్లు ఒప్పందం కుదుర్చుకున్నారట.
సెన్సారు సమస్యలు వచ్చి, విడుదల కాకపోతే మొత్తం వెనక్కు ఇవ్వాలన్నది అగ్రిమెంట్ సారాంశం అట. అయితే గల్ఫ్ లో గోపాల గోపాలకు కాస్త భారీగానే కట్స్ చెప్పినట్లు వినికిడి. దాంతో పవన్ సీన్లు చాలా వరకు లేచిపోయే పరిస్థితి.
అందుకనే సెన్సార్ వద్దని, రిజెక్ట్ డ్ అనిపించేసుకుని వదిలేసారు. అంతా బాగానే వుంది. సదరు పెద్దమనిషికి పదిలక్షలు మాత్రం వెనక్కు రాలేదట. ఫోన్ లు చేస్తుంటే సమాధానం లేదట. లబోదిబోమంటున్నాడా పెద్దమనిషి,. ఇండియా వచ్చినా డబ్బులు వెనక్కువస్తాయా? మన సినిమావాళ్ల వ్యవహారాలు ఇలాగే వుంటాయి మరి.