గ్రాఫిక్సే కాదు..ప్యాచ్ వర్క్ కూడా?

అఖిల్ సినిమా వాయిదా పడింది. ఎప్పుడు అన్నది ఇప్పుడే తెలియదు. గ్రాఫిక్స్ సరిగ్గా రాక వాయిదా వేసాం అన్నది నాగ్, ఇంకా దర్శకుడు వివి వినాయక్ మాట. అయితే విడుదల మరో పది పన్నెండు…

అఖిల్ సినిమా వాయిదా పడింది. ఎప్పుడు అన్నది ఇప్పుడే తెలియదు. గ్రాఫిక్స్ సరిగ్గా రాక వాయిదా వేసాం అన్నది నాగ్, ఇంకా దర్శకుడు వివి వినాయక్ మాట. అయితే విడుదల మరో పది పన్నెండు రోజుల్లో వుందనగా గ్రాఫిక్స్ చూసుకున్నారా? ఓ పక్క సెన్సారుకు వెళ్లే సమయం కూడా దగ్గర పడింది. ఇలాంటపుడు గ్రాఫిక్స్ చూసుకుంటారా..ముందు నుంచీ చూస్తారు కానీ. అయితే ఇక్కడ ఓ సమస్య వుంది. టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ముందు ఇంతలా నెగిటివ్ టాక్ వినిపించిన సినిమా ఇటీవలి కాలంలో అఖిల్ ఒక్కటే. అదే అసలు సమస్య అని వినికిడి.

ఎందుకింత నెగిటివ్ టాక్ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయింది అన్నది నాగ్ ను ఆందోళనకు గురిచేసి, సినిమా రష్ చూసాడట. కొడుకును అప్పగిస్తే ఇలాంటి సినిమా తీస్తారా అని కాస్త ఆవేశ పడ్డాడని టాక్ వినిపిస్తోంది. దాంతో పాటు కొన్ని సూచనలు కూడా చేసాడని వినికిడి. దాని వెనుక నాగ్ అమితంగా నమ్మే దర్శకుడు రాఘవేంద్రరావు సలహాలు కూడా వున్నాయని వినికిడి. దాంతో ఇప్పుడు ఆ పనులు గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేయాల్సి వుంది. 

ఇంతకీ ఇది ఇలా వుంటే, ప్రాక్టికల్ గా నాగ్ కు సినిమాతో సంబంధం లేదు. ఎందుకంటే ఆయన హీరో తండ్రి అంతే. సినిమా తేదీ వాయిదా గురించి నిన్న ప్రకటించింది నిర్మాత నితిన్ నే. కానీ ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి వివరణ ఇచ్చింది మాత్రం నాగ్. దీనికి కారణం విడుదల వాయిదా పై నితిన్, అఖిల్ నాగ్ తో విబేధించారని తెలుస్తోంది. అఖిల్ వాయిదా వార్త తరువాత మరి ఎవర్నీ కలవలేదని, ఎవరితోనూ టచ్ లో లేకుండా ఒంటరిగా వుండిపోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మరి మళ్లీ అఖిల్ ఎప్పుడు మూడ్ లోకి వస్తాడో, ప్యాచ్ వర్క్ లు ఎప్పుడు ఫినిష్ చేస్తారో? విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో? కానీ దీనివల్ల మరో సైడ్ ఎఫెక్ట్ వుండొచ్చు. దసరాను దృష్టి లో పెట్టుకుని కొన్న బయ్యర్లు, ఈ వదంతుల కారణంగా రేట్ల విషయంలో మళ్లీ బేరసారాలకు దిగే ప్రమాదం వుంది. అడ్వాన్స్ లు కట్టినవారు ఫైనల్ ఎమౌంట్ లు కట్టేటపుడు కాస్త బేరాలాడే అవకాశం లేకపోలేదు.

నితిన్ ఇప్పుడు ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. మరీ ఆవేశపడి ఇంత పెద్ద ప్రాజెక్టును నితిన్ తలకు ఎత్తుకున్నాడన్న కామెంట్ లు కూడా వినిపిస్తున్నాయి. నాగ్ చాలా తెలివిగా, భారీ సబ్జెక్ట్, ప్రాజెక్టు అంతా రెడీ చేసి వదిలాడు. తాను నిర్మాత అయితే ఇంత ఖర్చుతో సినిమా చేసేవాడా అంటే అనుమానమే.