హీరో మూడ్ స్వింగ్స్

మామూలుగానే హీరోలకు మూడ్ స్వింగ్స్ అన్నది కామన్. దానికి అనుగుణంగా దర్శకులు, నిర్మాతలు సర్దుకుపోతూ వుండాలి. ఆ మూడ్ స్వింగ్స్ అన్నది హీరో రేంజ్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంటాయి.  Advertisement కొంత మంది అవకాశాన్ని…

మామూలుగానే హీరోలకు మూడ్ స్వింగ్స్ అన్నది కామన్. దానికి అనుగుణంగా దర్శకులు, నిర్మాతలు సర్దుకుపోతూ వుండాలి. ఆ మూడ్ స్వింగ్స్ అన్నది హీరో రేంజ్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంటాయి. 

కొంత మంది అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కావాలని మూడ్ స్వింగ్‌ను కొని తెచ్చుకుంటూ వుంటాడనే టాక్ కూడా వుంది. కేరవాన్ లో వుండి చిర్రుబుర్రు లాడుతూ వుంటే యూనిట్ కు అర్థం అయిపోతోంది. హీరోగారు ఆ రోజు షూట్ క్యాన్సిల్ కొట్టించేలా వున్నారని. ఇలా వుంటాయి హీరోల వ్యవహారాలు. 

అయితే చిన్న, మిడ్ రేంజ్ హీరోలకు ఈ మూడ్ స్వింగ్స్ అన్నవి ఎక్కువగా వుండవు. కానీ డైరక్టర్ మెత్తన అయినా, డైరక్టర్ ను ఇరుకున పెట్టాలనుకున్నా మూడ్ స్వింగ్స్ ప్రదర్శించడం కామన్.

ఇప్పుడు ఓ మిడ్ రేంజ్ హీరో అలాగే చేస్తున్నాడట. షూటింగ్‌ను పరమ బద్దకంగా చేయడంలో ఈ హీరోకు మాంచి ట్రాక్ రికార్డ్ వుంది. మూడు రోజులు చేస్తే చాలు ఒక రోజు ఎగ్గొట్టేస్తాడని టాక్ వుంది. ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. అన్నీ నచ్చే ఒప్పుకున్నాడు. కానీ ఈ మధ్యనే ఏమైందో తెలియదు, ఎప్పుడు ఏక్షణం ఎలా మూడ్ వుంటుందో తెలియడం లేదట. దాంతో దర్శకుడు ఇబ్బంది పడుతున్నాడు. 

ఈ మూడ్ స్వింగ్స్ ఆ హీరోకి వున్న చిన్న చిన్న హెల్త్ సమస్యల వల్లనా అన్నది కూడా ఓ అనుమానమే అంటున్నారు. ఇవన్నీ బయటకు వస్తే హీరోకి మైనస్ అని, అతని సన్నిహిత వర్గాలు, పీఆర్ వర్గాలు ముందుగానే డైరక్టర్ తప్పు అందుకే హీరో అలా వున్నాడు అనే రీతిలో గ్యాసిప్ లను బయటకు వదలుతున్నట్లు తెలుుస్తోంది. 

డైరక్టర్ దే తప్పు అన్న వార్తలు చూసి, యూనిట్, డైరక్టర్ అంతా ఆశ్చర్యపోతున్నారట. హీరో మూడ్ స్వింగ్స్ ఏమిటి? మన మీద తోసేయడం ఏమిటి అని చెవులు కొరుక్కుంటున్నారు. అంతకన్నా చేసేది ఏమీ లేదు కదా?