విక్టరీ వెంకటేష్…నాగ్ కు బావ..అంటే నాగ్ మేనల్లుడు సుశాంత్ కు బాబాయేగా.. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సుశాంత్ మళ్లీ తన స్వంత బ్యానర్ లాంటి బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు. దాంట్లో హీరోయిన్ సోనమ్ బజ్వా..ఆ మధ్య వచ్చిన పాండవుల్లో ఒక్కడు అనే డబ్బింగ్ సినిమాలో హీరోయిన్ గా చేసిన అమ్మాయి. నాలుగైదు పంజాబీ సినిమాల్లో వేసిన ఈ అమ్మాయి, తెలుగులో సశాంత్ సరసన ఆటాడుకుందాం రా అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతవరకు బాగానే వుంది.
ఇప్పుడు అదే అమ్మాయి.. వెంకీ-మారుతి కాంబినేషన్ సినిమాలో ఐటమ్ గర్ల్ అయిపోయింది. అబ్బాయి హీరోయిన్ ను బాబాయ్ ఐటమ్ గర్ల్ గా మార్చేసారన్న మాట. నిజానికి వెంకీ సినిమాను హారిక హాసిని రాధాకృష్ణ తన కొత్త బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అందువల్ల కాస్త బ్యానర్ వాల్యూ కోసమైనా కాస్త పేరున్న హీరోయిన్ నో, ఐటమ్ గర్ల్ నో తెచ్చి వుంటే సినిమాకు ప్లస్ గా వుండేది.
మరి ఇలా ఎందుకు చేసినట్లో? వెంకీ లాంటి సీనియర్ హీరోల సినిమాలకు ఓపెనింగ్ లు బాగా వుండాలంటే, కొంచెం అట్రాక్షన్లు వుండాలి..అందుకు ఈ సోనమ్ బజ్వా సరిపోతుందా?