ఇక పవన్‌కళ్యాణ్‌ చేతుల్లో..!

ఎల్లుండి రిలీజ్‌ అనగా… ఈ రోజు సాయంత్రానికి కానీ ‘గోపాల గోపాల’ విడుదల అధికారికంగా ఖరారు కాలేదు. ‘థాంక్‌ గాడ్‌..’ పవన్‌కళ్యాణ్‌ ఉన్నాడు కాబట్టి ఇంత ఆలస్యంగా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయిందనే చింత…

ఎల్లుండి రిలీజ్‌ అనగా… ఈ రోజు సాయంత్రానికి కానీ ‘గోపాల గోపాల’ విడుదల అధికారికంగా ఖరారు కాలేదు. ‘థాంక్‌ గాడ్‌..’ పవన్‌కళ్యాణ్‌ ఉన్నాడు కాబట్టి ఇంత ఆలస్యంగా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయిందనే చింత లేదు. ఆల్రెడీ ‘గోపాల గోపాల’ ఫీవర్‌ స్టార్ట్‌ అయిపోయింది. బెనిఫిట్‌ షోల హంగామాకి అభిమానులు ప్రిపేర్‌ అయిపోతున్నారు. 

పండక్కి రావాల్సిన సినిమా.. నాలుగు రోజుల ముందే వస్తోంది. శుక్రవారానికి రెడీ కాలేక శనివారం రిలీజ్‌తోనే సర్దుకుపోయింది. ‘గోపాల గోపాల’ చిత్రం విడుదల విషయంలో చాలా కాంప్రమైజులు జరిగాయి. మామూలుగా అయితే భయపడాలి. కానీ పవన్‌కళ్యాణ్‌ ఉన్నాడనే ధైర్యం, భరోసాతో రిస్కు తీసేసుకుంటున్నారు. మరి ‘గోపాల గోపాల’కి ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలాగుంటుందో ఏంటో చూడాలి. 

మొదటి రోజు వసూళ్ళ నుంచీ పవన్‌ మాయ చేయాలి. నాలుగో రోజు నుంచి ఎదురయ్యే శంకర్‌ మాయ నుంచి కూడా ‘గోపాల గోపాల’ని పవనే కాపాడాలి. ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ అయిన నాటి నుంచీ పవన్‌ చుట్టూ పరిభ్రమిస్తోన్న ఈ చిత్రం ఫైనల్‌గా ఫలితం విషయంలో కూడా అతని మేనియా మీదే భారం మోపింది.