లెక్క సెటిల్‌ చేస్తానంటున్న ఫ్లాప్‌ హీరో

సరిగ్గా ఏడాది క్రితం నాని కెరీర్‌ సాఫీగా సాగిపోతూ ఉంది. మంచి చిత్రాలు ఎంచుకుని చేసే అలవాటున్న నాని కెరీర్‌ బండి సడన్‌గా గాడి తప్పింది. ఒకే నెలలో వరుసగా తగిలిన రెండు ఎదురు…

సరిగ్గా ఏడాది క్రితం నాని కెరీర్‌ సాఫీగా సాగిపోతూ ఉంది. మంచి చిత్రాలు ఎంచుకుని చేసే అలవాటున్న నాని కెరీర్‌ బండి సడన్‌గా గాడి తప్పింది. ఒకే నెలలో వరుసగా తగిలిన రెండు ఎదురు దెబ్బల నుంచి కోలుకోవడానికి కొన్ని నెలలు అవసరమయ్యాయి. పైసా, ఆహా కళ్యాణం ఎఫెక్ట్‌కి జెండాపై కపిరాజు ఇంకా విడుదలకి నోచుకోలేకపోయింది. 

అయితే గత సంవత్సరం చేసిన గాయం నుంచి కోలుకోవడానికి అవసరమైన బలం నానికి ఆల్రెడీ సమకూరింది. కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు అంగీకరించడంతో.. పరాజయాల నుంచి బయటపడి తిరిగి పట్టాలెక్కేస్తాననే ధీమా నానిలో కనిపిస్తోంది. 

Video: Watch Yevade Subramanyam First Look Teaser

త్వరలో విడుదల కాబోతున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ డైరెక్టర్‌ క్రియేటివ్‌గా ప్రమోట్‌ చేస్తూ ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. సేఫ్‌ సినిమాల మారుతితో నాని నెక్స్‌ట్‌ సినిమా పనులు వేగం పుంజుకున్నాయి. ‘అందాల రాక్షసి’ దర్శకుడు హను రాఘవపూడితో 14 రీల్స్‌ బ్యానర్‌లో నాని మరో సినిమా కమిటయ్యాడు. ఎన్ని ఫ్లాపులు పడినా ఒక్క హిట్టొస్తే మళ్లీ అంతా నార్మల్‌ అయిపోతుంది కనుక ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌కి ఈ ఏడాది కలర్‌ఫుల్‌గా ఉంటుందనే ఆశిద్దాం.