సబ్జెక్ట్ బాగుందని ఓకె అనేసాడు కానీ, మహేష్ వీలయినంత ముందు జాగ్రత్త తీసుకుంటున్నాడట బ్రహ్మోత్సవం సినిమా మీద. శ్రీకాంత్ అడ్డాల మంచి దర్శకుడే కానీ ముకుంద అంతగా ఆకట్టుకోలేదు.. .సీతమ్మవాకిట్లో లాంటి మల్టీస్టారర్ వ్యవహారం వేరు.
Advertisement
అందుకే ఈ సారి మహేష్ చాలా ఆలోచిస్తున్నాడట. స్క్రిప్ట్ లో కాస్త మార్పులు చేర్పులు, సీన్లు రీరైటింగ్ వంటి సూచనలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీన్ నెరేషన్ ల మరీ లాగ్ వద్దని కూడా సూచించినట్లు తెలుస్తోంది. ఓ రేంజ్ కు చేరిన హీరోకు ఆ మాత్రం జాగ్రత్తలు వుండాలి మరి.