గోపాల గోపాల సినిమా విడుదల కిందా మీదా అవుతోంది. ఈ రోజు సెన్సార్ అవుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. నిజానికి ఇటీవలే సెన్సారు అధికారి మారిపోయారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఇబ్బంది అయ్యేది.
ఎందుకంటే ఇంతకు ముందు పనిచేసిన ధనలక్ష్మి చాలా స్ట్రిక్టు అధికారి. లాస్ట్ మినిట్ సెన్సారుకు నో అనేవారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ లుక్ అనేది ఆమె నిబంధన. పైగా చాలా పద్దతిగా సెన్సారు వ్యవహారాలు సాగేవి. ఇప్పుడు కనుక ఆమె వుండి వుంటే, గోపాల గోపాల 10,11 ల్లో విడుదల కావడం కష్టం అయ్యేది.
ఇప్పుడు ఏ కటింగ్ లు చెప్పకుండా వుంటే పది న విడుదలకు పెద్దగా ఇబ్బంది వుండదు. కాస్త అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్ లు పడితే 11న వచ్చేస్తుంది.