మొత్తానికి దర్శకుడు మారుతి-నాని కాంబినేషన్ సినిమా ఫిబ్రవరి తొలివారంలో ప్రారంభమవుతోంది. యువి క్రియేషన్స్, అల్లు అరవింద్ జాయింట్ వెంచర్. కథానాయిక దగ్గర వచ్చింది సమస్య. మారుతి తన స్కూలు నుంచి వచ్చి, తమిళంలో మాంచి స్టార్ గా మారిన శ్రీ దివ్య అయితే ఈ సినిమా పెర్ ఫెక్ట్ మ్యాచ్ అంటున్నారట.
నిర్మాతలు ఊ..ఆ అంటున్నారని వినికిడి. మల్లెల తీరంలో సిరిమల్లెపూవు సినిమాలో అచ్చమైన బాఫు బొమ్మలా కనిపించిందీ అమ్మాయి. అంతకు ముందు మారుతి బస్ స్టాప్ లో నటించింది. అసలే నాని కి ఓపెనింగ్స్ అంతంత మాత్రం.
మరి ఇక దీనికి తోడు హీరోయిన్ కూడా సాఫ్ట్ అంటే ఎలా వుంటుందన్నది అనుమానం. కానీ మారుతి మాత్రం ఆమె అయితేనే బెటర్ అంటున్నారు. నాని విషయంలో కూడా మారుతే, కాస్త పట్టుపట్టి ఓకె చేయించుకున్నారు. అందువల్ల హీరోయిన్ కూడా ఓకె అయిపోవచ్చు.