ఇప్పుడొస్తున్న కామెడీ గురించి నేనేమీ చెప్పలేను

కామెడీ లేని తెలుగు సినిమాలను ఊహించలేం. సునిశితమైన హాస్యంతో ఎంతో మంది దర్శకులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాంటి దర్శకుల్లో రేలంగి నరసింహారావు ఒకరు. ఆయన సీరియస్‌గా కనిపించినా ఆయన చిత్రాలు ఆద్యంతం నవ్వుల…

కామెడీ లేని తెలుగు సినిమాలను ఊహించలేం. సునిశితమైన హాస్యంతో ఎంతో మంది దర్శకులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాంటి దర్శకుల్లో రేలంగి నరసింహారావు ఒకరు. ఆయన సీరియస్‌గా కనిపించినా ఆయన చిత్రాలు ఆద్యంతం నవ్వుల విందు చేస్తాయి. హీరో రాజేంద్రప్రసాద్‌తో ఆయన చేసిన సినిమాలు నేటికీ గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. 

దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా ఎంతో అనుభవం సంపాదించిన ఆయన 1980 ప్రాంతాల్లో గొప్ప సినిమాలు అందించాడు. నేటికీ అనేక కధాచర్చల్లో పాల్గొంటూ కొత్త దర్శకులకు స్క్రిప్టులో సహాయం చేస్తూ దాసరి నారాయణరావు అనుంగు శిష్యుల్లో ఒకడిగా ఉంటూ మరోసారి తన సత్తాను నిరూపించకునే టైం కోసం ఎదురు చూస్తున్న రేలంగి నరసింహారావు ఇప్పుడొస్తున్న కామెడీ ట్రెండ్‌ గురించి మాట్లాడమని అడిగితే నేనేమీ వ్యాఖ్యానించను ఏ కామెడీ ఉద్దేశ్యమైనా నవ్వించడమే ప్రధానం కదా అంటున్నాడు.

గతంలో కన్నా ఎక్కువమంది కమెడియన్స్‌ వృద్ధిలోకి రావడం ఆహ్వానించదగ్గ విషయమనీ.. అయితే సినిమాలకు అవసరమైన కామెడీ వేరేగా ఉంటుందనీ దేన్ని పడితే దాన్ని కామెడీ అనుకోవడం వీలుకాదనీ చెబుతున్నాడాయన. కధలో లీనమైన కామెడీకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందనీ.. టీవీల్లో వస్తున్న ట్రెండ్‌ని యథాతదంగా సినిమాల్లో పెట్టలేం.

ముఖ్యంగా మహిళలను కించపరచడం ఒకర్ని ఒకరు మోసం చేసుకోవడం కామెడీ కాదనీ, ప్రస్తుతం తమ తరం దర్శకులు నవ్విచలేక వెనకబడి పోలేదనీ ఎందుకో మాలో సరుకు అయిపోయిందని నిర్మాతలు భావించడం తప్ప మేం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూనే ఉంటామనీ మంచి అవకాశం వస్తే మళ్లీ ప్రూవ్‌ చేసుకుంటానని చెబుతున్న సీనియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు మంచి కామెడీని అందిస్తారని ఆశిద్దాం.