హీరో అవ్వాలనే ఆశ ఉండేదప్పుడు

తెర మీద హీరో అవ్వాలనే ఆశ ప్రతి కళాకారుడిలోనూ ఎప్పుడో ఒకప్పుడు కలగక మానదు. అలాంటి ఆలోచన తనకీ కలిగిందంటున్నాడు గాయకుడు నాగూర్‌ బాబు అలియాస్‌ మనో.  Advertisement చిన్నతనం నుండీ ఎన్నో కష్టనష్టాలు…

తెర మీద హీరో అవ్వాలనే ఆశ ప్రతి కళాకారుడిలోనూ ఎప్పుడో ఒకప్పుడు కలగక మానదు. అలాంటి ఆలోచన తనకీ కలిగిందంటున్నాడు గాయకుడు నాగూర్‌ బాబు అలియాస్‌ మనో. 

చిన్నతనం నుండీ ఎన్నో కష్టనష్టాలు అనుభవించి, కళల పట్ల అభిరుచిని ఏర్పర్చుకున్న మనో తల్లిగారు స్టేజి ఆర్టిస్టట. నాటకాల్లో తల్లి నటిస్తున్నప్పుడే ఆమె వెంట ఉంటూ తనలోని కళాతృష్ణకు పదును పెట్టుకున్న మనోకు స్కూలు టైంలో సినిమాల్లో హీరో అవ్వాలనే ఆశ కలిగిందట. 

అప్పటికి పాడటం, స్టేజీల మీద అనౌన్సర్‌గా కాస్త అనుభవం రావడంతో ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉండేదట. అప్పటికి హీరో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ తెరకు పరిచయమై ప్రూవ్‌ చేసుకుంటున్న టైమ్‌. ఎన్నోసార్లు తనని తాను అద్దంలో చూసుకుని హీరోగా పనికొస్తానా లేదా అని సంఘర్షణ పడుతుండేవాడట. 

పొట్టిగా ఉంటే ఎలా హీరో అవ్వడం అనుకున్నప్పుడల్లా నటుడు చంద్రమోహన్‌ గుర్తుకు వచ్చి ఆయన కూడా తనలాగే పొట్టిగా ఉండి ప్రూవ్‌ చేసుకున్నాడు కదా అని ధైర్యం కలిగేదట. తనకి తెలిసిన ఒక ప్రొడ్యూసర్‌ దగ్గర హీరో అవ్వాలనే కోరికను వెల్లబుచ్చితే ఆయన వింతగా చూసాడట. 

ఆ చూపుల్లో ఉన్న మేటర్‌ అర్ధమైపోయి హీరో అవ్వాలి అనే ఆలోచనని పక్కన పెట్టి తనకు చేతనయిన పాటల మీద దృష్టి పెట్టి గాయకుడిగా అప్లాజ్‌ అందుకున్నాడట. పాడటంలో మెలకువలన్నీ నేర్చుకుని ఆర్కెస్ట్రాల్లో పాడుతూ సినిమా గాయకుడి గానూ పేరు రావడంతో హీరో అవ్వాలనే కోరిక కనుమరుగై పోయిందట. 

ఇక సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌కు డబ్బింగ్‌ చెప్పడంలో మనో తప్పితే ఇంకొకరు లేరనే చెప్పాలి. వందలకొద్దీ, వేలకొద్దీ కచేరీలు చేసిన మనో ఇప్పుడు టీవీల్లో కూడా వ్యాఖ్యాతగా హోస్ట్‌గా పేరు తెచ్చుకోవడం ఆయన టాలెంట్‌కు నిదర్శనం.