ఒకప్పుడు హీరోయిన్ వేరుగానూ, క్లబ్ డాన్సర్ వేరుగానూ డాన్సులు చేసేవారు. 1989 వరకూ ఐటం సాంగ్స్ కోసం ప్రత్యేకమైన డాన్సర్స్ ఉండేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పేరున్న హీరోయిన్స్ కూడా ప్రత్యేక గీతాల్లో డాన్స్ చెయ్యడానికి ఒప్పుకుంటున్నారు. ఆటో అప్పారావు పాటలో పార్వతీ మిల్టన్ చేసింది. గరమ్ ఛాయ్ సాంగ్‌లో ఛార్మి నటించింది. ఇప్పుడు నేను ఐటం సాంగ్స్ చేస్తే ప్రోబ్లం ఏంటీ? అని ప్రశ్నిస్తోంది ప్రఖ్యాత కథానాయిక కాజల్ అగర్వాల్.
ఎంతో మంది తనని ఐటం సాంగ్ కోసం అడుగుతున్నారనీ, ఇప్పుడు అలాంటి పాటల్లో చెయ్యడానికి ఆలోచించాల్సిన పని కూడా లేదనీ, మంచి బ్యానర్ దొరికినప్పుడు ఐటం సాంగ్ చేసి మెప్పిస్తానని కూడా కాజల్ అగర్వాల్ చెబుతుంది. ‘దబాంగ్ 2’ సినిమా కోసం కరీనా కపూర్ ఫెవికాల్‌సే అంటూ చేసిన ఐటం నెంబర్ ఎంత హిట్టో వేరే చెప్పక్కర్లేదు.
కరీనాలాంటి గొప్ప హీరోయిన్నే శృంగార గీతంలో డాన్సులు చేయగా అలాంటి వాటిల్లో నేను నటిస్తే ఇబ్బంది ఏంటీ? అంటూ ముందుగానే తనపై విమర్శలు రాకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న కాజల్ అగర్వాల్‌కు ఇప్పుడు అట్టే సినిమాల్లేవు. కాబట్టి ఐటంసాంగ్స్‌కి సై అంటుందని ముందుగా తమిళంలో బోణీ కొట్టాక తెలుగులో కూడా చేస్తుందట. వివరాలు త్వరలో తెలుస్తాయి మరి.