కొన్ని సినిమాలింతే..వాటిని థియేటర్లోకి వచ్చే యోగం వుండదు. నాని నటించిన జెండాపై కపిరాజు వ్యవహారం అచ్చంగా ఇలాంటిదే. ఇప్పుటి అరడజనుకు పైగా విడుదల తేదీలు మారాయి. తాజగా ఈ నెల మూడోవారం లేదా నాలుగో వారం అన్నారు. కానీ ఇప్పుడు మళ్ల డౌట్ లో పడింది.
ఇరవై ఒకటిన నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ విడుదలవుతోంది. అలాంటి సమయంలో దానికి కాస్త అటుఇటుగా ఈ సినిమా విడుదల చేయడం అంటే, అర్థం లేని పని . అందుకే మళ్లీ వాయిదా వేసారని వినికిడి. జెండాపై కపిరాజు విడుదల తేదీ మారుస్తారని నాని చెబుతున్నాడు.
నిజమే, ఇప్పటికే తమిళనాట ఫ్లాప్ అనిపించుకున్న సినిమా, దానికోసం ప్రామిసింగ్ సినిమా సుబ్రహ్మణ్యాన్ని బలి చేయడం ఎందుకు? మరి జెండా ఇప్పట్లో ఎగరదు. ఎందుకంటే ఈ నెల దాటితే రెండు నెలల వరకు చిన్న సినిమాలకు స్లాట్ లేదు కదా.