సత్యమూర్తి…సేల్ క్లోజ్

‘రేసుగుర్రం’ అల్లు అర్జున్…’జులాయి’..త్రివిక్రమ్ శ్రీనివాస్..ఇంక ఆ కాంబినేషన్ కు తిరుగేముంటుంది. అందుకే..సన్నాఫ్ సత్యమూర్తి మీద భారీ అంచనాలున్నాయి. హీరో, డైరక్టర్ ఇద్దరి ట్రాక్ రికార్డు సూపర్ గా వుంది మరి. పైగా భారీ స్టార్…

‘రేసుగుర్రం’ అల్లు అర్జున్…’జులాయి’..త్రివిక్రమ్ శ్రీనివాస్..ఇంక ఆ కాంబినేషన్ కు తిరుగేముంటుంది. అందుకే..సన్నాఫ్ సత్యమూర్తి మీద భారీ అంచనాలున్నాయి. హీరో, డైరక్టర్ ఇద్దరి ట్రాక్ రికార్డు సూపర్ గా వుంది మరి. పైగా భారీ స్టార్ కాస్టింగ్..ముగ్గురు హీరోయిన్లు స‌మంత‌, నిత్యమీన‌న్‌, ఆదాశ‌ర్మ , బోలెడు మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, కన్నడ స్టార్ ఉపేంద్ర, నిన్నటి హీరోయిన్ స్నేహ..ఇలా లిస్ట్ చాలానే వుంది.  

ఇక మళ్లీ జల్సా, జులాయి, అత్తారింటికి దారేది..మాదిరిగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌. ఇంక అంచనాలకు లోటేముంది. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి బిజినెస్ మొత్తం చకచకా పూర్తయిపోయింది. చాలా భారీ రేంజ్ లో థియేటర్ హక్కులు అమ్ముడైపోయాయని వినికిడి. దాని ద్వారా యాభై అయిదు నుంచి 58 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇధి కాక తొమ్మిది కోట్లకు పైగా శాటిలైట్..ఈ రేంజ్ కు లాభాలు తోడు చేసుకుంటే..కలెక్షన్లు కొత్త రికార్డులు సృష్టించేలాగే వున్నాయి.