తెలుగు ఏంకర్లలో సుమ, ఝాన్సీది డిఫరెంట్ స్టయిల్. కాస్త డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా వుంటూనే చలాకీగా ఏంకరింగ్ చేస్తుంటారు. కానీ అలాంటి ఝాన్సీ నిన్నటికి నిన్న కిక్ 2 కు చాలా చిత్ర విచిత్రమైన వేషాలు వేసి, ఏకరింగ్ చేసింది. రకరకాల పేర్లు, రకరకాల ఇమిటేషన్లు.
Advertisement
దూరంగా వున్న జనాలు గోల చేసి, తమ అసంతృప్తి వెళ్ల గక్కారు కానీ, దగ్గరున్నవారు లోలోపలే ఏమిటిదంతా అనేసుకుంటూ చెవులు కొరుక్కున్నారు. ఎవరు వారి పరి వారి స్టయిల్ లో చేస్తేనే బాగుంటుంది. ఆలీ వేషాలు వేస్తే బాగుంటుంది. కానీ ఝాన్సీ లాంటివాళ్లు వేస్తే..అంత..బా…గోదు. డిగ్నిఫైడ్ గా ఏంకరింగ్ చేస్తేనే బెటర్ అంటున్నారు ఝాన్సీ అభిమానులు.