Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కళ్యాణ్ రామ్ @ ఫుల్ రొమాంటిక్

కళ్యాణ్ రామ్ యేంటీ.. ఈ పాట ఏంటీ? చితక్కొట్టేసాడు కదా. నా నువ్వే సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ టీజర్ విడుదల చేసారు. సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్, డైరక్టర్ జయేంద్ర కలిసి మరోసారి సఖి సినిమా పాటలను గుర్తు తెచ్చారు.

కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా ఒక పది పదిహేనేళ్లు వెనక్కు వెళ్లిపోయారు. ఈ మధ్యకాలంలో ఏ యంగ్ హీరోతో కూడా ఇంత రొమాన్స్ ఒలకపోయలేదు తమన్నా. ఇద్దరూ కలిసి 'నా నువ్వే' ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీ అన్న లుక్ తీసుకువచ్చేసారు.

సినిమా ఏమిటో, సబ్జెక్ట్ ఏమిటో అన్న విషయాల సంగతి అలా వుంచితే, ప్రస్తుతానికి విడుదలయిన సాంగ్ మాత్రం నా నువ్వే సినిమా మీద కాస్త ఆసక్తి పెంచింది అన్నది వాస్తవం.

పటాస్, ఇజమ్, ఎమ్మెల్యే ఇలా డిఫరెంట్ సినిమాలు అటెంప్ట్ చేస్తూ వెళ్తున్న కళ్యాణ్ రామ్ మరోసారి నా నువ్వే సినిమాతో అలాంటి ప్రయత్నమే మరోసారి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?