కార్తికేయ తమిళ వెర్షన్ ను ఈ రోజు తిరుపతి బ్రదర్స్, లింగుస్వామి కి సంబంధించిన జనం, ఎడిటర్ మోహన్, చూసారు. సినిమాను ముందుగానే తమిళ వెర్షన్ ను దృష్టిలో పెట్టుకుని, డబుల్ ఎక్స్ పోజ్ లు చేయడంతో, నేటివిటీ బాగుందని వారు అభిప్రాయపడినట్లు బోగట్టా. అయితే అసలు చూద్దామనుకున్న పెద్ద మనిషి ఆర్ బి చౌదరి ఇంకా చూడలేదు. ఆయన బుధ, గురువారాల్లో చూస్తారట.
అయితే రీమేక్ కు నిర్మాత శ్రీనివాస్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. రీమేక్ చేస్తే హక్కుల కింద పెద్ద మొత్తం రాదని, సినిమా డబ్బింగ్ వెర్షన్ మొత్తం సెన్సార్ కు రెడీగా వుంది కాబట్టి, అయిన ఖర్చు ఎలాగూ అయింది కాబట్టి, నేరుగా పంపిణీ చేద్దామని చూస్తున్నారు. మంచి పంపిణీ సంస్థ ముందుకు వస్తే, ఎంతో కొంత అడ్వాన్స్ ఎన్ ఆర్ కింద తీసుకుని, ఫిఫ్టీ, ఫిఫ్టీ షేర్ కింద విడుదలచేయిస్తే కాస్త ఎక్కువ మొత్తం వస్తుందని ఆశపడతున్నారు.
అదే సమయంలో హీరో నిఖిల్ కూడా తాను ఈసినిమాకు చాలా సాయం పట్టానని, ప్రమోషన్ కు చాలా కష్ట పడ్డానని, అందువల్ల ఇలాంటి సినిమతో, తమిళనాట పరిచయం అయితే బాగుంటుందని అంటున్నాడట. అందువల్ల నూటికి తొంభై తొమ్మిది శాతం డబ్బింగ్ కే అవకాశం వుందంటున్నారు.