తనతో పని చేయడానికి రెడీగా ఉన్న దర్శకులకి చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. శ్రీను వైట్ల ఫ్లాప్ ఇచ్చాడు కనుక అతడి చిత్రాన్ని హోల్డ్‌లో పెట్టాడని అనుకోవడానికి లేదు. ఎందుకంటే హిట్ ఇచ్చిన దర్శకులకి కూడా చరణ్ ఓకే చెప్పట్లేదు. మిర్చి తర్వాత కొరటాల శివ, లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీను ఇద్దరూ చరణ్‌తోనే ముందుగా సినిమా చేయాల్సి ఉంది.
కానీ వారిద్దరి కథల్ని చరణ్ రిజెక్ట్ చేసాడు. చరణ్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని సదరు దర్శకులంతా కథలు సిద్ధం చేసుకుంటుంటే అతడేమో వేరేదో కావాలంటూ అందరినీ రిజెక్ట్ చేస్తున్నాడు. పోనీ నచ్చిన కథ ఉంది కదా.. అదైనా చేస్తున్నాడా అంటే అదీ లేదు. కోన, గోపీమోహన్ తయారు చేసిన కథని ఓకే చేసి.. దానికి దర్శకుడిని ఫిక్స్ చేయట్లేదు.
ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఏంటనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వకుండా ఖాళీగా కూర్చున్న చరణ్ అసలు ఏం చేద్దామనుకుంటున్నాడో, ఇప్పుడతని మైండ్ సెట్ ఏంటో కూడా దర్శకులకి అంతు చిక్కడం లేదు. తన సినిమా విషయంలోనే క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్న చరణ్‌కి మరోవైపు చిరంజీవి 150వ చిత్రాన్ని సెట్ చేయడమనే భారం కూడా పడిరది. ఏదేమైనా చరణ్ తదుపరి చిత్రం ఖరారయి, పూర్తయి, విడుదల కావడానికి కనీసం మరో ఏడాది వేచి చూడాల్సిందే.