కోడితో స్వీటీ

అనుష్క కెరీర్‌ని మ‌లుపు తిప్పిన సినిమా అరుంధ‌తి. జేజ‌మ్మగా అనుష్క న‌ట‌న… ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకొంటూనే ఉంటారు. ఇంత మంచి పాత్రని త‌న‌ని న‌మ్మి అప్పగించినందుకు శ్యాంప్రసాద్‌రెడ్డి, కోడిరామకృష్ణ మేలు మ‌ర్చిపోలేనంటూ…

అనుష్క కెరీర్‌ని మ‌లుపు తిప్పిన సినిమా అరుంధ‌తి. జేజ‌మ్మగా అనుష్క న‌ట‌న… ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకొంటూనే ఉంటారు. ఇంత మంచి పాత్రని త‌న‌ని న‌మ్మి అప్పగించినందుకు శ్యాంప్రసాద్‌రెడ్డి, కోడిరామకృష్ణ మేలు మ‌ర్చిపోలేనంటూ అనుష్క చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు కోడి రుణం తీర్చుకొనే స‌మ‌యం జేజ‌మ్మకు వ‌చ్చేసింది.

పుట్టప‌ర్తి స‌త్యసాయిబాబా జీవిత క‌థ ఆధారంగా కోడి రామ‌కృష్ణ ఓ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇందులో ఓ చిన్న పాత్రలో న‌టించ‌మని కోడిరామ‌కృష్ణ అనుష్కని కోరార‌ట‌.

దానికి అనుష్క కూడా సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. త‌న ద‌గ్గర కాల్షీట్లు అందుబాటులో లేక‌పోయినా.. అనుష్క ఈ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకొంద‌ని, అతిథి పాత్రే కాబ‌ట్టి పారితోషికం కూడా డిమాండ్ చేయ‌లేద‌ని తెలుస్తోంది.  త్వర‌లోనే స్వీటీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతోంది.