క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ చాన్నాళ్ల తరువాత సినిమా చేస్తున్నారు. రంగమార్తాండ అనే ఆ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక తదితరులు నటిస్తున్నారు. కృష్ణవంశీకి ప్రకాష్ రాజ్ అత్యంత స్నేహితుడు. వారిద్దరి మధ్య అపూర్వమైన స్నేహబంధం వుందని టాలీవుడ్ లో టాక్ వుంది.
కానీ రంగమార్తాండ సినిమా విషయంలో కృష్ణవంశీకి ప్రకాష్ రాజ్ చుక్కలు చూపిస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఆదిలో భాగస్వామి. కానీ తరువాత తనకు భాగస్వామ్యం వద్దని, కోటి రూపాయల మేరకు రెమ్యూనిరేషన్ వసూలు చేసినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
రైట్స్ ప్రకాష్ రాజ్ పేరిట వుండడం, తదితర కారణాలు దీని వెనుక వున్నాయని వినిపిస్తోంది. దీంతో కృష్ణవంశీ మరో పార్టనర్ ను వెదుక్కున్నారని తెలుస్తోంది. ఇదిలా వుంటే నిన్నటికి నిన్న ఆర్ఎఫ్ సి లో షూటింగ్ పెడితే ప్రకాష్ రాజ్ రాలేదని తెలుస్తోంది. కేవలం రెండే రెండు సీన్లు తీసి షూటింగ్ ఆపేసారని బోగట్టా. దీనివల్ల ఆరోజు షూటింగ్ ఖర్చు మొత్తం వృధా అయిందని టాక్.
సంక్రాంతి రోజు మళ్లీ షూటింగ్ పెడితే మధ్యాహ్నానికి కానీ ప్రకాష్ రాజ్ రాలేదని మరో గ్యాసిప్ వినిపిస్తోంది. మొత్తం మీద ఈ సినిమా షూట్ ను కృష్ణవంశీ పళ్ల బిగువన కంప్లీట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.