కృష్ణ..కృష్ణ..నువ్వు గొప్పోడివి స్వామీ

ఎవర్వికి రాని ఆలోచన ఒక్కడికి వచ్చింది అంటే వాడు మహానుభావుడు అయి వుండాల్సిందే. ఎబిఎన్ వెంకటకృష్ణ అలాంటి మహానుభావుడు అనుకోవాల్సిందే. ఆదివారం నాడు రాధాకృష్ణ పలకరిస్తారు. ఈవారం వెంకట కృష్ణ పలకరించారు. ఏ కృష్ణ…

ఎవర్వికి రాని ఆలోచన ఒక్కడికి వచ్చింది అంటే వాడు మహానుభావుడు అయి వుండాల్సిందే. ఎబిఎన్ వెంకటకృష్ణ అలాంటి మహానుభావుడు అనుకోవాల్సిందే. ఆదివారం నాడు రాధాకృష్ణ పలకరిస్తారు. ఈవారం వెంకట కృష్ణ పలకరించారు. ఏ కృష్ణ అయినా పలవరింత ఒకటే. ఇంతకీ ఈవారం సంగతేమిటంటే..వెంకట కృష్ణకు అద్భుతమైన విషయం తట్టింది.అయితే అది ఆయనకు సిఎమ్ జగన్ క్యాంప్ కు సన్నిహితంగా వుండే వ్యక్తి చెప్పాడట. ఆయన కూడా ఇలాంటి గొప్పోడే అయి వుండాలి. ఇంతకీ ఏమిటి ఆ విషయం.

తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి జగన్ వెళ్లకపోవడానికి, అక్కడ ఓటర్లకు డబ్బులు పంచకపోవడానికి అద్భుతమైన కారణం వుంది. అది ఈ వెంకటకృష్ణ, ఆయనకు ఆ విషయం ఉప్పందించిన మహానుభావుడుకు మాత్రమే తెలుసు. ఇంతకీ అది ఏమిటంటే..'తిరుపతిలో వైకాపా ఎలాగూ గెలుస్తుంది. కానీ మెజారిటీ మరీ భయంకరంగా వచ్చేస్తే, ప్రస్తుతం అత్యధిక మెజారిటీగా జగన్ పేరిట వున్న రికార్డు చెరిగిపోతుంది.అందుకనే జగన్ ప్రచారానికి రాలేదు. డబ్బులు పంపలేదు. ఆ విధంగా తన మెజార్టీ రికార్డు బద్దలు కాకుండా చూసుకున్నారు. 

నిజంగా ఈ విషయం తట్టిన వ్యక్తి కానీ ఆయన ద్వారా తెలుసుకున్న వెంకట కృష్ణ కానీ ధన్యులు. నమ్మగలిగే సంగతేనా ఇది? అత్యధిక మెజార్టీతో గెలిస్తే, తెలుగుదేశం కుదేలు అయిపోతుంది కదా? జగన్ కు అది ముఖ్యమా, రికార్డు ముఖ్యమా? పైగా ఇదే వెంకట కృష్ణ తను రాసిన వ్యాసంలోని మొదటి మూడు పేరాల్లోనే ఒకదానితో మరొకదానికి పొంతన లేని విషయాలు ప్రస్తావించారు.

పాయిట్ వన్...వైకాపానే గెలుస్తుందని, పార్టీలు, విశ్లేషకులు, మీడియా ఇలా అందరికీ తెలుసు.

పాయింట్ 2…నిజానికి ఈ ఉపఎన్నికలో 5 లక్షలకుపైగా మెజారిటీ సాధించాలని తన మంత్రులకు ఎంఎల్‌ఏలకు జగన్‌ ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించారు.

పాయింట్ త్రీ..అన్న ప్రచారానికి వస్తే తప్ప గండం నుంచి బయటపడలేమని మెజారిటీ నేతలు భావించి.. అదే విషయాన్ని అధినేతకు మొరపెట్టుకున్నారు. 

కానీ… మెజారిటీ రాకపోతే అభాసుపాలు అవుతామనే ఉద్దేశంతోనే జగన్‌ కరోనా సాకును చూపించి ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని పార్టీ నేతలు చెప్తారు.

ఈ పాయింట్లు చెప్పిన తరువాత సదరు వెంకటకృష్ణ చెప్పిన సంగతేమిటంటే జగన్ ప్రచారం రద్దు చేసుకోవడానికి అసలు కారణం తిరుపతి అభ్యర్థి గురమూర్తి మరీ అద్భతమైన మెజారిటీతో గెలిచ్చేస్తే కడపలోతనకు వున్న రికార్డు పోతుందన్నదే. సో తిరుపతిలో వైకాపా కు అయిదున్నర లక్షల మెజారిటీ రాకూడదు అని జగన్ అనుకున్నారన్నమాట.

ఇప్పుడు చెప్పండి..పాయింట్ వన్ కు…పాయింట్ టూ కి, త్రీ కి ఏమైనా పొంతన, ఇతరత్రా వ్యవహారాలు వున్నాయా?  ఇదేమైనా సినిమానా? రికార్డు చెరిగిపోతుందని థియేటర్ లోంచి సినిమాను తీసేసారు అని అనడానికి. రాజకీయం. కీలకమైన తిరుపతి ఎన్నికను జగన్ ఇలా చూస్తారని అనుకోవాలా?

గెలుస్తారని మీరే అంటారు. మెజారిటీ లక్ష్యాలు డిసైడ్ చేసారని అంటారు. ప్రతిపక్షం బలపడింది వైకాపా బలహీనమైందని అంటారు. అందుకే జగన్ రావాలి అనుకున్నారు అంటారు. అప్పుడే కాదు తూచ్..రికార్డు పోతుందని రాలేదు అంటారు. 

ఏమిటిదంతా? రాయాలి కాబట్టి ఏదో ఒకటి ఇలా కిందా మీదా పడడం తప్ప మరేమిటి? మీరు గొప్పోడు స్వామీ.