టాలీవుడ్ లో హీరోల మధ్య బయటకు అవాజ్యమైన అభిమానాలు, ప్రేమలు కనిపిస్తాయి. కానీ లోలోపల ఎవరి ఇగోలు వారివి. ఎక్కడకైనా వెళ్లాలంటే ముందుగా పీఆర్ టీమ్ లు వెళ్తాయి. అక్కడ అన్నీ చూసి కబురు చేస్తేనే 'బాబులు' బయలుదేరతారు. ఎక్కువ టైమ్ వేస్ట్ కాకుండా చూసుకుంటారు.
అక్కడ స్వాగతానికి లోటు లేకుండా చూసుకుంటారు. పైగా అక్కడ మరో పెద్ద హీరో వుంటే అదో సమస్య. నిన్నటికి నిన్న సాక్షి అవార్డుల ఫంక్షన్ లో ఓ చిత్రం చోటు చేసుకుందని అక్కడికి హాజరైన వారు చెప్పుకుంటున్నారు.
మహేష్ బాబు ఫంక్షన్ లో వున్నారు. ఈ లోగా బన్నీ వచ్చేసారు. లోపలకు వెళ్లకుండా కాస్సేపు కారులోనే వుండిపోయారు. ఆ తరువాత కిందకు దిగినా లాంజ్ లో వుండిపోయారు తప్ప లోపలికి వెళ్లలేదు.
మహేష్ ఇలా బయటకు వెళ్లడం, బన్నీ అలా లోపలకు రావడం ఒకేసారి జరిగాయి. ఇద్దరూ ఒకేసారి ఒకే దగ్గర వుంటే ఏమైనా సమస్యనా? ఎవరి స్టార్ డమ్ వారిది, ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారిది. మరెందుకో ఈ ఎడమొహం..పెడమొహం?