సరికొత్త మహేష్

మహేష్‌బాబు యంగ్ ఏజ్‌లోనే హీరోగా మారినా కానీ ఎందుకనో అతనికి యూత్‌ఫుల్ క్యారెక్టర్స్ ఎక్కువగా రాలేదు. కాలేజ్ నేపథ్యంలో అతను చేసిన సినిమాలు చాలా చాలా తక్కువ. ఎక్కువగా యాక్షన్ బేస్డ్ సినిమాలు చేసిన…

మహేష్‌బాబు యంగ్ ఏజ్‌లోనే హీరోగా మారినా కానీ ఎందుకనో అతనికి యూత్‌ఫుల్ క్యారెక్టర్స్ ఎక్కువగా రాలేదు. కాలేజ్ నేపథ్యంలో అతను చేసిన సినిమాలు చాలా చాలా తక్కువ. ఎక్కువగా యాక్షన్ బేస్డ్ సినిమాలు చేసిన మహేష్‌బాబు యూత్ ట్రెండ్స్‌కి, టేస్ట్స్‌కి భిన్నమైన చిత్రాల్లో నటించాడు. అఫ్‌కోర్స్ వాటితోనే అతనికి యువతలోను విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసిందనుకోండి. 

కాకపోతే అచ్చంగా యూత్‌ని టార్గెట్ చేసిన సినిమాలే చేసి ఉన్నట్టయితే మహేష్‌బాబు ఇంకెంతగా యూత్‌ని ఆకట్టుకునేవాడో మరి. మొట్టమొదటిసారిగా మహేష్‌బాబుని యూత్ ఐకాన్‌గా చూపిస్తున్నాడు సుకుమార్. 1 చిత్రంలో మహేష్‌బాబు అల్ట్రా స్టయిలిష్‌గా కనిపిస్తూ నేటి తరం ప్రేక్షకులకి కొత్త ఫ్యాషన్స్ నేర్పిస్తాడట. 

మహేష్ సరసన క్రితి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇన్నేళ్లలో దేవిశ్రీప్రసాద్ ఒక్కసారి కూడా మహేష్‌తో వర్క్ చేయకపోవడం విశేషం. ఈ చిత్రంలో మహేష్ కొత్తగా కనిపిస్తాడని అంతా అంటుంటే, దేవి ఏమో తాను కొత్తగా వినిపిస్తానని చెబుతున్నాడు. ఈ చిత్రంలో తన సంగీతం చాలా కొత్తగా, దేవీనే చేశాడా అనేట్టు ఉంటుందట.