Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ మరోసారి సుకుమార్-మహేష్

డిఫరెంట్ డైరక్టర్ సుకుమార్ తో సూపర్ స్టార్ మహేష్ చేసిన వన్ సినిమాను ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. సినిమా సక్సెస్ సంగతి ఎలా వున్నా, మంచి ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. ఇప్పుడు మళ్లీ అలాంటి మ్యాజిక్ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రామ్ చరణ్ తో మైత్రీ మూవీస్ బ్యానర్ లో సుకుమార్ చేస్తున్న సినిమా పూర్తయిపోతే, తరువాత మహేష్ తోనే సుకుమార్ సినిమా చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుకుమార్ లైన్ మహేష్ చాలా కాలం కిందటే ఓకె చేసేసినట్లు తెలుస్తోంది. మహేష్ ఒకేసారి సుకుమార్ రెండు లైన్లు ఓకె చేసారని, అందులో ఒకటి వన్ అని, రెండవది ఈసారి తెరకెక్కుతుందని తెలుస్తోంది. బహుశా మళ్లీ 14 రీల్స్ సంస్థే ఈ సినిమాను కూడా నిర్మించే అవకాశం వుంది. 

సబ్జెక్ట్ కే ప్రయారిటీ

ఎవరికి సినిమా చేస్తా అన్నది, నిర్మాత, దర్శకుడు బట్టి కాదని, ఓకె అనిపించే స్క్రిప్ట్ ఎవరు ముందు తెస్తే, వారికే సినిమా ముందు చేస్తా అని మహేష్ తన దగ్గరకు వస్తున్నవారికి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికి కొరటాల శివ సినిమా ఓకె అయింది. దాని తరువాత వంశీ పైడిపల్లికా? సుకుమార్ కా? త్రివిక్రమ్ కా? అన్నది వారు స్క్రిప్ట్ రెడీ చేయడం బట్టి వుంటుంది. అప్పుడే సినిమా పివిపి కా? 14 రీల్స్ కా? మైత్రీ మూవీస్ కా అన్నది డిసైడ్ అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?