మళ్లీ మూడు సినిమాలు చేస్తాడ‌ట‌

స్టార్ క‌థానాయ‌కుల‌తో సినిమా నిర్మించ‌డం అంటే ఆషామాషీ కాదు. వాళ్ల కాల్‌షీట్ల కోసం యేళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూడాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక స్టార్‌తో ఒక సినిమా చేయ‌డం అంటే  పెద్ద విష‌యం కింద…

స్టార్ క‌థానాయ‌కుల‌తో సినిమా నిర్మించ‌డం అంటే ఆషామాషీ కాదు. వాళ్ల కాల్‌షీట్ల కోసం యేళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూడాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక స్టార్‌తో ఒక సినిమా చేయ‌డం అంటే  పెద్ద విష‌యం కింద లెక్క‌. కానీ… కొద్దిమంది నిర్మాత‌లు మాత్రం చాక‌చ‌క్యంగా వ్యవ‌హ‌రిస్తూ స్టార్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకొని వ‌రుస‌గా సినిమాలు చేస్తుంటారు. 

తెలుగులో 14రీల్స్ సంస్థే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ఈ సంస్థ మ‌హేష్ బాబుతో వ‌రుస‌గా మూడో సినిమా తీస్తోంది. వంద కోట్లకి ఒప్పందం కుదుర్చుకొని మ‌హేష్‌తో ఈ సినిమాలు నిర్మించింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు చెబుతుంటారు.  `ఆగ‌డు`తో ఆ మూడు సినిమాల ఒప్పందం పూర్తవుతుంది. అందుకే మ‌రోసారి ఇదే త‌ర‌హాలో  ఒప్పందం కుదుర్చుకోవాల‌ని ఆ సంస్థ ప్రయ‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్టు స‌మాచారం. 

అయితే.. మ‌హేష్ మాత్రం యుటీవీకీ, వైజ‌యంతీ మూవీస్ సంస్థకీ సినిమాలు చేస్తాన‌ని ఒప్పుకొన్నారు. దీంతో 14 రీల్స్‌కి ఇప్పట్లో సినిమా చేయ‌లేన‌ని చెబుతున్నాడ‌ట‌. ఆ సంస్థ మాత్రం ఈ సినిమాలు పూర్తయ్యాకే కొత్త ఒప్పందం మొద‌లుపెట్టుకొందామ‌ని అడుగుతోంద‌ట‌. ఆ మేర‌కు మ‌హేష్ ఒప్పుకొనే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం.