మరో గెటప్ లోకి షిఫ్ట్ అయ్యాడు

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఈసారి మరో అవతారంలోకి మారాడు. తన ప్రతి సినిమాకు ఓ కొత్త లుక్ లో కనిపించే ఈ హీరో ఈసారి మరింత వెరైటీగా ముస్తాబయ్యాయి. చెవిపోగులు, ముక్కపుడక, మెలితిప్పిన…

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఈసారి మరో అవతారంలోకి మారాడు. తన ప్రతి సినిమాకు ఓ కొత్త లుక్ లో కనిపించే ఈ హీరో ఈసారి మరింత వెరైటీగా ముస్తాబయ్యాయి. చెవిపోగులు, ముక్కపుడక, మెలితిప్పిన మీసం.. ఇలా ఆడ-మగ కాంబినేషన్ లో కొత్తగా కనిపిస్తున్నాడు అమీర్. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” సినిమా కోసం ఈ కొత్త గెటప్ లోకి మారాడు అమీర్.

ఇంతకీ ఈ లుక్ ఎలా బయటకొచ్చిందో తెలుసా..? ప్రస్తుతం గుజరాత్, అస్సాం రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. వరద బాధితుల్ని ఆదుకునేందుకు అంతా ముందుకు రావాలని పిలుపునిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు అమీర్. ఆ వీడియో సందేశం ద్వారా ఈ హీరో కొత్త లుక్ బయటపడింది. ముఖ్యమంత్రి సహాయనిధికి తను విరాళం అందిస్తున్నానని, అందరూ ఇలానే విరాళాలు ఇచ్చి వరద బాధితుల్ని ఆదుకోవాలని తన లేటెస్ట్ వీడియోలో కోరాడు అమీర్.

గెటప్స్ తో పిచ్చెక్కిచ్చడం అమీర్ కు కొత్త కాదు. దంగల్, పీకే, దిల్లీబెల్లీ, త్రీ ఇడియట్స్, గజనీ.. ఇలా ఎన్నో సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించి మెప్పించాడు అమీర్.