భలేభలే మగాడివోయ్ లాంటి బిగ్ సక్సెస్ ను భలేగా ఎంజాయ్ చేస్తోంది దర్శకుడు మారుతి టీమ్. ఇప్పటికే ఆంథ్ర పర్యటన పూర్తి చేసుకున్న ఈ టీమ్ ఇప్పుడు అమెరికా ప్రయాణమై వెళ్తోంది. దర్శకుడు మారుతి, హీరో నాని, నిర్మాతలు బన్నీ వాసు, వంశీ వినాయకచవితి సాయంత్రం బయలుదేరి అమెరికా వెళ్తున్నారు.
భలే భలే మగాడివోయ్ సినిమా ఇప్పటికే 1.2మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈవారం కొరియర్ బాయ్ కళ్యాణ్ ఒక్కటే ఓవర్ సీస్ లో కాస్త ప్రభావం చూపించగలిగేది. ఇప్పుడు మారుతి టీమ్ థాంక్స్ గివెన్ పేరుతో అమెరికాలో పది రోజులు పర్యటించబోతోంది.
అంటే మరికాస్త కలెక్షన్లు డల్ కాకుండా నిల్చునే అవకాశం వుంది. అంటే మరి కొన్ని సినిమాల కలెక్షన్లు అధిగమించవచ్చు.