మే లో సినిమాల తాకిడి

బాహుబలి 2 కి ముందు వెనుక అన్నట్లు అయింది టాలీవుడ్ పరిస్థితి. దీంతో మార్చిలో, ఏప్రిల్ లో రాలేకపోయిన అనేక సినిమాలు ఇప్పుడు మే కోసం రెడీగా వెయిట్ చేస్తున్నాయి. మే ఫస్ట్ వీక్ నుంచే…

బాహుబలి 2 కి ముందు వెనుక అన్నట్లు అయింది టాలీవుడ్ పరిస్థితి. దీంతో మార్చిలో, ఏప్రిల్ లో రాలేకపోయిన అనేక సినిమాలు ఇప్పుడు మే కోసం రెడీగా వెయిట్ చేస్తున్నాయి. మే ఫస్ట్ వీక్ నుంచే విడుదల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సినిమాల సంఖ్య తక్కువేమీ కాదు.

బాబు బాగా బిజీ సినిమా ఇప్పటికే మే ఫస్ట్ వీక్ కు రుమాలు వేసేసింది. అంతకు ముందే శర్వానంద్ రాధ సినిమా ఏప్రియల్ నుంచి మే కు వెళ్లిపోయింది. నిఖిల్ సినిమా కేశవ మేలో విడుదల అని ముందే ప్రకటించేసారు. నాగ చైతన్య-కళ్యాణ్ కృష్ణ కాంబో రారండోయ్ వేడుక చూద్దాం కూడా మే లోనే విడుదల. అంటే ఇక్కడికే నాలుగు సినిమాలు అయ్యాయి. రాజ్ తరుణ్ అంథగాడు రెడీ అయి వుంది. అది కూడా మే నెలలోనే విడుదల. ఇవి కాక ఇంకా చిన్న చిన్న సినిమాలు చాలా వున్నాయి.

ఇవన్నీ ఇలా వుంటే బన్నీ-హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాధమ్ మే విడుదల అన్నవార్తలు వినిపించాయి కానీ, మళ్లీ జూన్ అని టాక్ వినవచ్చింది. ఒకవేళ బాహుబలి 2 ఎఫెక్ట్ అంతగా వుండదు అనుకుంటే మనసు మార్చుకుని మే లో వచ్చినా వచ్చేస్తుంది.ఇదిలా వుంటే సునీల్ సినిమా ఉంగరాల రాంబాబు కూడా దాదాపు రెడీ అయిపోతోంది. 

మొత్తం మీద మే నెల అంతా సినిమా విడుదలలకు ఫుల్ టైట్ అనే చెప్పుకోవాలి.