మెగా ఫ్యాన్స్ ఎప్పుడో చీలిపోయారు. ఇప్పుడు కాస్త అధికారికం కానుంది. చిరు రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెట్టాడో.. మెగా ఫ్యాన్సంతా పనన్ కల్యాణ్‌వైపు టర్న్ అయ్యారు. ఆ రోజుల్లో అదేం చిరుకి ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు ఒకే ఇంట్లో రెండు కుంపట్లు వచ్చి చేరాయి. ఎప్పుడైతే చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాడో… అప్పుడే అన్నాదమ్ముల మధ్య అడ్డుగోడ ఏర్పడిపోయింది. ఆ క్షణం చిరు ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ అంటూ వేరుపడ్డారు.
ఇప్పుడు ఒకే ఇంట్లో రెండు పార్టీలు వెలిశాయి. కాంగ్రెస్‌కో హఠావో… అని పిలుపునిచ్చిన పవన్ ఒక విధంగా చిరు కాళ్ల కింద ప్రకంపనలు వచ్చేశా చేశాడు. అందుకే ఫ్యాన్సంతా అన్నయ్యతోనే ఉంటారు… అని నాగబాబు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇప్పుడు దాన్నే అధికారికంగా చెప్పించాలన్నది మెగా కాంపౌండ్ ప్రయత్నం. అందుకే రామ్‌చరణ్ పుట్టిన రోజున హైదరాబాద్‌లో చిరంజీవి అభిమాన సంఘాల మీటింగ్ జరగనుంది. ఇది సర్వ సభ్య సమావేశం. సభ్యులంతా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా పంచుకొనే వీలుంది. అభిమానులంతా.. ఎవరి వైపున ఉండాలో ఈ సమావేశంలో తేల్చేస్తారు. అంతమంగా అందరూ చిరుకే జై కొట్టడం ఖాయం.
ఒక విధంగా పవన్‌ని నైతికంగా దెబ్బతీయడానికి చేస్తున్న చిరు ప్రయత్నం. ఈ సమావేశానికి చిరు అభిమానులంతా హాజరుకానున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం సమావేశానికి దూరంగా ఉండబోతున్నారు. గురువారం నాటి సమావేశంలో చిరంజీవి అభిమానుల్లో ఒకవేళ చీలిక వస్తే.. కొంతమంది పవన్ వైపు మళ్లితే ఏమిటన్నది చిరు వర్గాల మీమాంశ. అదేం జరక్కుండా అభిమాన సంఘాలతో నాగబాబు అప్పుడే సంప్రదింపులు మొదలెట్టేశాడని టాక్. మొత్తానికి చిరు అభిమానులంతా ఏకమవుతున్న ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుంది? చివరికి ఏమవుతుంది? అన్నది ఆసక్తికరం.