దర్శకుడు మేర్లపాక గాందీ పేరు సినిమా అభిమానులకు సుపరిచితమే. అంతకన్నా ముంద తెలుగు పాఠకులకు మేర్లపాక మురళి పేరు కూడా బాగా పరిచయం. కాస్త ఎరోటిక్ టచ్ వున్న శృంగార కథలను రంగరించి రాసేవారు ఆయన.
చాలా క్రేజ్ వుండేది ఆ నవలలకు. లేటెస్ట్ గా మేర్లపాక గాంధీ కథ, డైరక్షన్ సూపర్ విజన్ లో తయారైన ఏక్ మినీ కథ ట్రయిలర్ చూస్తే, ఆయన ఫాదర్ మురళి గుర్తుకు వచ్చారు.
తండ్రి కథల్లోంచి తెచ్చారా? తండ్రి రాసిన కథలను గుర్తు తెచ్చుకుని ఈ కథ తయారు చేసుకున్నారా? అన్న చిన్న క్యూరియాసిటీ. తెలుగు సినిమాల్లో డైరక్ట్ గా ఇలాంటి పాయింట్ డిస్కస్ చేయడం ఇదే తొలిసారి.
గతంలో కూడా సీరియస్ ఎ సర్టిఫికెట్ సినిమాలు వచ్చాయి. కానీ ఇలా ఫన్నీగా డిస్కస్ చేయడం ఇదే తొలిసారి కావచ్చు. ఇది కనుక జనాలు బాగా రిసీవ్ చేసుకుంటే గాంధీ తండ్రి మేర్లపాక మురళి రాసిన ఇలాంటి టైపు నవలలు చాలా అంటా చాలా వున్నాయి.
ఓటిటిలో కాబట్టి కచ్చితంగా పిచ్చ పిచ్చగా రిసీవ్ చేసుకుంటారని ట్రయిలర్ చూడగానే అర్థం అయిపోతోంది. హీరో సంతోష్ కమెడియన్ సుదర్శన్ కలిసి బాగానే నవ్వులు పూయించినట్లు ట్రయిలర్ చెబుతోంది. ఇప్పటికే ఓ పాట, దాని సిగ్నేచర్ స్టెప్ బాగా జనాల్లోకి వెళ్లాయి.
థియేటర్ లోకి వస్తే ఎలా వుండేదో కానీ ప్రస్తుతం ప్రయిమ్ లో కచ్చితంగా హిట్ బాటలోనే వుండేలా కనిపిస్తోంది ఏక్ మినీ కథ.