మొదటిదానికే దిక్కులేదు ప్రభాస్

ప్రభాస్..బాహుబలి ఉక్కు కౌగిలిలో ఇరుక్కుని, సినిమాలు లేకుండా చేసుకుంటున్నాడు. బాహుబలి పార్ట్ 2 ఇంతవరకు సెట్ మీదకు వెళ్లలేదు. ఫస్ట్ పార్ట్ తయారీలో వుండగానే రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ కు మాటిచ్చాడు.…

ప్రభాస్..బాహుబలి ఉక్కు కౌగిలిలో ఇరుక్కుని, సినిమాలు లేకుండా చేసుకుంటున్నాడు. బాహుబలి పార్ట్ 2 ఇంతవరకు సెట్ మీదకు వెళ్లలేదు. ఫస్ట్ పార్ట్ తయారీలో వుండగానే రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ కు మాటిచ్చాడు. తనతో ఓ సినిమా చేస్తా అని. ఇప్పుడు అలాగే మరొకళ్లకు కూడా మాటిచ్చేసాడట. యువి క్రియేషన్స్ బ్యానర్ లో జిల్ సినిమా చేసిన కె కె రాధాకృష్ణ కుమార్ కు ఈసారి ప్రభాస్ మాటిచ్చాడట. 

బాహుబలి 2 అయిన తరువాత సినిమా చేద్దాం, కథ రెడీ చేసుకోమని. అసలు బాహుబలి 2 ఎప్పటికి మొదలవుతుందో, ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. 2016 దాటి పోవాలి. మరి ఆపైన సుజిత్ సినిమా అంటే 2017. మరి ఇక ఈ రాధాకృష్ణ సినిమా అంటే 2018. ఇలా క్యూలో ఎంతమందిని కూర్చో పెడతాడో ప్రభాస్..పాపం. వాళ్లేమో సినిమాలు లేకుండా అలా వుంటున్నారు.