లవ్యూ బంగారం అంటూ ఓ సినిమా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు మారుతి. మళ్లీ ఇప్పుడు వెంకటేష్ తో బాబు బంగారం అంటున్నాడు. బంగారం అచ్చివచ్చిందనా అని అనుకోవడానికి లేదు..ఎందుకంటే లవ్యూ బంగారమ్ హిట్ సినిమా ఏమీ కాదు. పైగా తెలుగులో బంగారం టైటిల్ పెట్టుకున్న సినిమాలో హిట్ పర్సంటేజ్ చాలా తక్కువ. పైగా చివర్న సున్నా ఒకటి. అప్పటికీ న్యూమరాలజీని బలంగా నమ్మే మారుతి తన ప్రేమకథా చిత్రమ్, లవ్యూ బంగారమ్ లకు చివర్న సున్నా లేకుండా జాగ్రత్త పడ్డాడు.
కానీ ఇప్పుడు బాబు బంగారం కు మాత్రం సున్నా తప్పలేనట్లుంది. ఇదిలా వుంటే వెంకటేష్ సినిమాకు సాఫ్ట్ టైటిళ్లు అలవాటే కానీ, మరీ బాబు బంగారం అంటే ఏదోలా వుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాకు ముందు రాధాకృష్ణ అని పేరు అనుకున్నారు.
అయితే నిర్మాత పేరు కూడా అదే కావడంతో వెనుకంజ వేసారు. రాధ అని పెడదామనుకుంటే గతంలో వెంకీతో మారుతి ప్రాజెక్టు అదే పేరుతో వికటించింది. అందుకే ఆఖరికి ఈ పేరుకు డిసైడ్ అయ్యారు. తినగా తినగా వేప కూడా తియ్యగా వుంటుందని, బాబు బంగారం..బాబు బంగారం అంటూ వుంటే అలవాటైపోతుందన్న ధీమా ఏమో? అయినా బాబు బంగారం అన్నది వింటూ వుంటే, ఎఫ్ ఎమ్ లో పాపులరైన బాబు బాగా బిజీ అనే హస్కీవాయిస్ ఫన్నీ టైటిల్ గుర్తుకు వస్తోంది తప్ప, వెంకీ సినిమాకు సూటయ్యే సూపర్ టైటిల్ అయితే కాదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.