నాని కామెడీనే నమ్ముకున్నాడా?

నాని..వైవిధ్యమైన నటుడు..అయితే పిల్ల జమీందార్ సినిమా తెచ్చిన కామెడీ ఇమేజ్ ఇంతా అంతా కాదు. అందుకే మళ్లీ అదే జోనర్ లో ట్రయ్ చేస్తున్నట్లుంది. భలే భలే మగాడివోయ్..ట్రయిలర్ చూస్తుంటే, ఇలాగే అనిపిస్తోంది. Advertisement…

నాని..వైవిధ్యమైన నటుడు..అయితే పిల్ల జమీందార్ సినిమా తెచ్చిన కామెడీ ఇమేజ్ ఇంతా అంతా కాదు. అందుకే మళ్లీ అదే జోనర్ లో ట్రయ్ చేస్తున్నట్లుంది. భలే భలే మగాడివోయ్..ట్రయిలర్ చూస్తుంటే, ఇలాగే అనిపిస్తోంది.

డిఫరెంట్ షేడ్ లు ఎమోషన్లు ఎన్ని వున్నా బేసిక్ ప్లాట్ కామెడీతో ముడిపడినట్లు కనిపిస్తోంది. అంటే ఈ జోనర్ లో వెళ్లి మరో హిట్ కొట్టాలని చూస్తున్నట్లుంది. దీనికి తోడు యువి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ నిర్మాణం కావడంతో, ఇదివరకు సినిమాల మాదిరిగా ఫైనాన్స్ సమస్యలు వుండవు.

అందువల్ల ఇటు సరైన సబ్జెక్ట్ ను, అటు సరైన యూనిట్ ను ఎన్నుకోవడం ద్వారా నాని సరైన స్టెప్ నే వేసినట్లు కనిపిస్తోంది. ఇక టీజర్ వ్యవహారం చూస్తే మరీ అద్భుతంగా లేకున్నా ఫరవాలేదనే రేంజ్ లోనే వుంది. ఇటు లవ్ రొమాంటిక్ ట్రాక్ లతో పాటు, కామెడీని కూడా ఫెర్ ఫెక్ట్ గా మిక్స్ చేసి, ఎమోషనల్ క్లయిమాక్స్ తో ముగించినట్లు కనిపిస్తోంది.