ప్రభుదేవాతో ఎఫైర్ బెడిసి కొట్టాకగానీ నయనతారకి తత్వం బోధపడినట్టు లేదు. కెరీర్ మీద తప్ప, ఇతరత్రా ఏ విషయాలమీదా నయనతార అంత సీరియస్‌గా రియాక్ట్ అవడంలేదు. గతంలో శింబుతో ఎఫైర్ నడపడం, అది చెడిపోవడంతో నయనతార, ప్రభుదేవా ప్రేమలో పడింది. ప్రభుదేవా దూరమయ్యాక.. ఎఫైర్లు శాశ్వతం కాదని తెలుసుకుంది.
ఇప్పుడంతా కెరీర్ మీదే నయనతార దృష్టి పెట్టింది. అందుకనే, ఎవరెక్కువ ‘పేమెంట్’ ఇస్తే వారికి సినిమా చేయాలనుకుంటోంది నయనతార. అదే సమయంలో, సినిమా తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేయకుండా వుండాలనే ఖచ్చితమైన అభిప్రాయంతో ముందుకు వెళ్తోందామె.
ఇంకెప్పుడూ శింబుతో సినిమా చేయబోనని చెప్పినా, ఇప్పుడామె శింబుతో ఓ సినిమాకి కమిట్ అయ్యింది. ఆ సినిమా కోసం నయనతార మునుపెన్నడూ అందుకోని రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోబోతోందట. తమిళంలో ఇటీవలే వచ్చిన ‘రాజు రాణి’ సినిమా సూపర్ హిట్ అవడంతో నయనతార రేంజ్ బాగా పెరిగిపోయింది.
శింబుతో సినిమా కోసం కోటిన్నర పైగానే రెమ్యునరేషన్ నయనతార డిమాండ్ చేయడం, నిర్మాత ఓకే చెప్పడం జరిగిపోయాయట.