మొత్తానికి ఆర్థిక సమస్యల చెర నుంచి గంగ బయటపడినట్లే వుంది. ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి వుంది. కానీ వివిధ సమస్యల కారణంగా అలా జరగలేదు. అయితే తమిళంలో యధావిధిగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
Advertisement
దాంతో ఇక్కడ కూడా ఇప్పడే విడుదల చేస్తే,కాస్త కలెక్షన్లు వుంటాయని, దాని వల్ల ఫైనాన్షియర్లకు కూడా కాస్త బాకీలు సర్దుబాటు అవుతాయని డిస్కషన్ మొదలైంది. ఈ రోజంతా డిస్కషన్లు, ఈ సమస్యలను ఎలా గట్టెక్కాలా అన్న విషయమై చర్చలు సాగినట్లు తెలిసింది.
ఆఖరికి రాత్రి పొద్దు పోయాక, రేపు అంటే ఆదివారం విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంకా ఇది అధికారికంగా ప్రకటించాల్సి వుంది.