నిఖిల్ కు ఎక్కడో సుడి వుంది. వెరైటీ కధలు అతన్ని వెదుక్కుంటూ వస్తున్నాయి. స్వామిరారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య అన్నీ వెరైటీ కథలే. కానీ చిత్రంగా మరి కొన్ని వెరైటీ కథలు అనుకున్నవి నిఖిల్ దగ్గరకు ముందే రావడం వాటికి ఎందుకనో నో చెప్పడం, అవి తరువాత బాక్సాఫీసు దగ్గర పెద్దగా ఫేర్ చేయకపోవడం జరిగినట్లు తెలుస్తోంది.
గత వారం విడుదలైన బీరువా సబ్జెక్ట్ ముందు నిఖిల్ దగ్గరకే వచ్చినట్లు వినికిడి. పెద్ద బ్యానర్, హంగామా అన్నీ చూసి ముందు కాస్త టెంప్ట్ అయినా, సినిమాలో స్టోరీకి లాజిక్ పెద్దగా లేదనుకున్నాడట. బీరువాలో కూర్చుని అంత సేపు ట్రావెల్ చేయడం లాంటి బేసిక్ క్వశ్చన్లు వేసుకుని, ఆఖరికి కిందామీదా పడి, నో అన్నాడట.
అలాగే లక్ష్మీ రావే మా ఇంటికి, జోరు కూడా ముందుగా నిఖిల్ తలుపు తట్టి, తీయక వెనక్కు వెళ్లాయట. పోనీ ఎస్ చెప్పడం కన్నా నో చెప్పడం నేర్చుకోవడం ముఖ్యం. నిఖిల్ కు అది బాగానే వంటబట్టినట్లుంది.