సినీ స్టార్లు, రాజకీయ నాయకుల వల్లనే తమ బ్యాంకులో నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయని ఆంధ్రా బ్యాంకు సిఎమ్ డి రాజేంద్రన్ అన్నారు. సరే రాజకీయ నాయకులు అన్నది రొటీన్ పదమే. వాళ్లు తమ తమ పలుకుబడి వాడి, రుణాల ఎగవేతకు పాల్డపడడం అన్నది మామూలే.
మరి సినిమా స్టార్లు కూడా ఈ జాబితాలోకి చేరడం, అందులో ఆంధ్రాబ్యాంకు అంటే తొంభై శాతం ఇక్కడి వారే ఖాతాదారులు కావడం అలోచించదగ్గ విషయం. అంటే మన టాలీవుడ్ స్టార్ లు కూడా ఈ ఎగవేత దారుల్లో వున్నారని అనుకోవాల్సి వస్తోంది. ఇంత చెప్పిన రాజేంద్రన్ నిరర్థక ఆస్తులు పోగేసుకోవడానికి కారణంమైన సినిమా స్టార్ల పేర్లను కూడా బయటపెడితే బాగుండేది.
పైగా ఇటవల రుణాల వసూలుకు ఆంధ్రాబ్యాంకు సిబ్బంది ఎగవేత దారుల ఇళ్ల ముందు ప్రదర్శనలు నిర్వహించినట్లు వార్తలు వినవచ్చాయి. అదే మాదిరిగా ఈ సినిమా స్టార్ల ఇళ్ల ముందు కూడా నిర్మొహమాటంగా ప్రదర్శనలు చేయాలి. తాము అభిమానించే తారల అసలు రూపు అభిమానులకు తెలిసి వస్తుందిగా.