ఎన్టీఆర్ కోసం అయిదుగురు షార్ట్ లిస్ట్

మూడుపాత్రల సినిమా టేకప చేసారు హీరో ఎన్టీఆర్. ముగ్గురు హీరోయిన్లు కావాలి. అదే పెద్ద సమస్యగా వుంది. ఎవరు సెట్ అవుతారో అనే దాని కన్నా, ఎవరి డేట్ లు సెట్ అవుతాయో అన్నట్లు…

మూడుపాత్రల సినిమా టేకప చేసారు హీరో ఎన్టీఆర్. ముగ్గురు హీరోయిన్లు కావాలి. అదే పెద్ద సమస్యగా వుంది. ఎవరు సెట్ అవుతారో అనే దాని కన్నా, ఎవరి డేట్ లు సెట్ అవుతాయో అన్నట్లు వుంది. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్ల డేట్లు సమాంతరంగా, పాతిక రోజుల వరకు ఒకేసారి కావాల్సి వుంది. పైగా దాదాపు అందరు హీరోయిన్లు బిజీగానే వున్నారు.

సినిమాకు ప్లస్ అవుతున్నారు అనుకున్నవారి డేట్ లు ఖాళీ లేవు. ఆఖరికి అయిదుగురి పేర్లు షార్ట్ లిస్ట్ చేసారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, రాశీఖన్నా, నివేదా థామస్, కాజల్ పేర్లు షార్ట్ లిస్ట్ చేసారు. 

రకుల్, శృతి హాసన్ ల కోసం ట్రయ్ చేసారు కానీ, డేట్ లు ఖాళీ లేవు. దీంతో ఈ అయిదుగురిని ఓకె చేసుకున్నారు. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఏ ముగ్గురి డేట్ లు సెట్ అవుతాయో మరి. వచ్చేనెల 10 షూటింగ్ ప్రారంభం. ఆలోగా తెలుస్తుంది.