నక్క ఒక చోట గౌరీ కళ్యాణమా? అని వెనకటికి సామెత వుంది. కృష్ణ అనే మేనేజర్ వ్యవహారం ఇలాంటిదే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతగాడు గతంలో పూరి జగన్నాథ్ దగ్గర వుండేవాడు. అక్కడ అనేకానేక ఆర్థిక అవకతవకలకు పాల్పడడమో, మరింకేం జరిగాయో కానీ, మొత్తానికి ఆ శిబిరం నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది.
అయితే తంతే బూర్లెగంపలో పడ్డట్టు ఎన్టీఆర్ దగ్గర పడ్డాడు. అప్పడే గ్యాసిప్పులు గుప్పు మన్నాయి. ఇతగాడిని ఎన్టీఆర్ దగ్గరకు తీసేడేమిటా? అని. ఇంతకీ తాజా వార్త ఏమిటంటే, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఉద్యాసన చెప్పేసాడని. ఇక్కడ కూడా లెక్కలు తేడా వచ్చాయని తెలిసింది. అందుకే ఇక సేవలు చాలు అని ఎన్టీఆర్ చెప్పేసాడట. అదీ సంగతి. అంతేనా? రామయ్యా వస్తావయ్యా కథను కిందా మీదా చూడకుండా ఒప్పుకోవడం వెనుక ఇతగాడి హ్యాండేమైనా వుందా?