పాపం దిల్ రాజు అంటే ఎలా వుండేవాడు? మూడు షూటింగ్ లు, ఆరు పంపిణీలు అన్నట్లుండేవాడు. మరోపక్క ఆయన సినిమా వసతి గృహంలో ఔత్సాహికులు కథలు వండుతూ, చర్చిస్తూ కనిపించేవారు. కానీ ఇప్పుడా కళంత గతమైపోతోంది. కేరింత అనే ఓ చిన్న సినిమా ఒక్కటే ఇప్పడు ఆయన చేతిలో వుంది.
ఆ మధ్య అంటే కూతురు పెళ్లి వ్యవహారాల్లో వుండి సినిమాలు తగ్గించారని అనుకున్నారంతా. కానీ అది కాదు అసలు విషయం, ఒకేసారి పెద్ద సినిమాలు చేసి, వాటి దెబ్బలు తట్టుకుని, ఆఖరికి దిల్ రాజు ఇలా మిగిలాడు అంటున్నారు. ఎవడు సూపర్ హిట్టే, కానీ పైసలు గిట్టుబాటు కాలేదని, వడ్డీలకు పోయాయని అంటున్నారు.
రామయ్యా వస్తావయ్యా కూడా అంతే సంగతులు. మరింకేం లేస్తాడు పాపం. అందుకే తనను ఇంతవాడిని చేసిన పంపిణీ రంగాన్నే నమ్ముకొవాలని,మంచి సినిమాలు కొని లాభాలు చేసుకుని, తేరుకున్నతరువాతే పెద్ద సినిమా జోలికి పోవాలని డిసైడైపోయినట్లు వినికిడి. అది కూడా అన్నీ కుదిరితే జాగ్రత్తగా చేసుకోవాలి కానీ, ఇలా ఒకేసారి అన్నీ రెడీ చేయకూడదని కూడా పాఠం నేర్చుకున్నాడట.