Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆస్కార్ కు ఆస్కారం ఇదేనా?

ఆస్కార్ కు ఆస్కారం ఇదేనా?

ఆస్కార్ మనకు తొలిసారి రాలేదు. ఇది మలి..మలి సారి అనుకోవాలి. గుల్జార్, రెహమాన్ , రసూల్ పూకొట్టి లాంటి వాళ్లకు వచ్చింది. అదే కోవలో మన చంద్రబోస్ కూ, మన కీరవాణికీ వచ్చింది. కానీ కొన్ని సందేహాలు మిగిలిపోయే వున్నాయి. 

నాటు పుట్ టాపింగ్ పాటలు మన తెలుగు సినిమాకు కొత్త కాదు. కొన్ని వందలు వున్నాయి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను దగ్గర నుంచి ఊ అంటావా మామా ఊఊ అంటావా వరకు. ఎన్నో ఎన్నెన్నో. కానీ ఆస్కార్ కు ఆస్కారం అంటే ఇదీ దారి అని రాజమౌళి ఓ దారి చూపించారు.

సరైన మీడియా కన్సల్టన్సీని వెదికి పట్టుకోవాలి. సరైన పీఆర్ కంపెనీని పట్టుకోవాలి. వాళ్లతో వందలాది మీటింగ్ లు, ప్లానింగ్ లు, పేమెంట్లు ఎన్నో వ్యవహారాలు వుంటాయి. పనులు అన్నీ మానుకుని విదేశాల్లో కూర్చుని ఇన్ ఫ్లుయెన్సర్లను పట్టుకోవాలి. 

డే పార్టీలు, నైట్ పార్టీలు, అరేంజ్డ్ ఇంటర్వూలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఇవన్నీ చేస్తే అప్పుడు ఆస్కార్ దృష్టికి వెళ్తుంది. అప్పుడు పాట సత్తా కనిపించి అవార్డు వస్తుంది. ఇందుకోసం అయ్యే ఖర్చు మీద ఎవరి వార్తలు వారికి వున్నాయి. నిజమెంత? నిజమైన ఫిగర్ ఎంత? అన్నది రాజమౌళి అండ్ కో కు తప్ప‌ మరెవరికి తెలియదు.

ఎంత గొప్ప పాట చేసినా ఎవరు ఈ తతంగం అంతా నడిపించగలరు. అలవైకుంఠపురములో సినిమాలో రాములో రాములా..పాట ఫుట్ టాపింగ్ నే. కానీ అది ఆస్కార్ వరకు వెళ్లాలి అంటే ఎంత ఖర్చు చేయాలి. ఆ సినిమా బడ్జెట్ ఎంతో అంత ఖర్చు చేయాలి? ఎవరు ముందుకు వస్తారు? అంటే ఎంత మంచి పాటలు వచ్చాయి..ఎంత ఫుట్ టాపింగ్ సాంగ్స్ చేయగలిగాం..రాయగలిగాం అన్నది కాదు. 

ఎన్ని కోట్లు ఖర్చు చేసి, ఎంత మేరకు లయిజినింగ్ చేసి ఆస్కార్ దృష్టిని ఆకర్షించగలిగాం అన్నదే కీలకం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?