పైసా వసూల్ బిజినెస్ జోరందుకున్నట్లే కనిపిస్తోంది. రేటు దగ్గర పంతం పట్టకుండా, రీజనబుల్ రేట్లు ఆఫర్ చేస్తూ, డీల్ లు కట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నైజాం, సీడెడ్, ఓవర్ సీస్ బిజినెస్ లు క్లోజ్ చేసిన నిర్మాతలు ఆంధ్ర బిజినెస్ స్టార్ట్ చేసారు. చెప్పడం 22కోట్ల రేషియోలో చెబుతున్నారు కానీ, కాస్త అటు ఇటుగా క్లోజ్ చేసే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికి అయితే ఇదే రేషియోలో గుంటూరు బిజినెస్ క్లోజ్ చేసారు. నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల రేంజ్ లో గుంటూరు హక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన వైజాగ్ ఏరియా డిస్కషన్లు సాగుతున్నట్లు వినికిడి. డైలీ ఒక ఏరియా వంతున క్లోజ్ చేసే కార్యక్రమం సాగుతోంది.
ఇదిలా వుంటే పైసా వసూల్ రీరికార్డింగ్ ఫినిష్ చేసారు. కేవలం ఇక డిటిఎస్ మిక్సింగ్ మాత్రం మిగిలి వుంది. అంటే మరో వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందన్నమాట. అప్పటికి ఇంకా పది రోజులు టైమ్ వుంది సినిమా విడుదలకు. పూరి డైరక్షన్ అంటే అలాగే వుంటుంది మరి. సినిమాను చకచకా ఫినిష్ చేయడంలో అతగాడు ఘనాపాఠి కదా.